అనంతపురం జిల్లా పెనుకొండ, ధర్మవరం, రాప్తాడు వంటి నియోజకవర్గాల్లో గట్టి పట్టున్న పరిటాల కుటుం బానికి గత ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బతగిలింది. తొలిసారి రంగ ప్రవేశం చేసిన పరిటాల వారసుడు శ్రీరాం.. రాప్తాడు నియోజకవర్గంనుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే.. దీనిని లైట్‌గా తీసుకునేందు కు.. జగన్ సునామీ కాబట్టి.. ఆయన పరాజయం పాలయ్యారని సరిపెట్టుకునేందుకు అవకాశం లేదు. ఎందుకంటే.. పరిటాల కుటుంబానికి ఇక్కడ ఉన్న ఫేమ్ అలాంటిది. ఎన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ.. ఈ కుటుంబం గెలుస్తూనే ఉంది.

కానీ, గత ఎన్నికల్లో మాత్రం ఈ కుటుంబానికి పెద్ద ఎదురు దెబ్బతగిలింది. మరి దీని నుంచి ఈ కుటుంబం బయట పడిందా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలు.. యువ నాయకుడు శ్రీరాం.. ప్రజల్లో ఉంటున్న తీరు.. వంటివి ఈ కుటుంబానికి ప్లస్‌లు పెరుగుతున్నాయని అంటున్నారు స్థానిక నాయకులు. గతానికి ఇప్పటికి భిన్నంగా.. శ్రీరాం.. ప్రజల మధ్య ఉంటున్నారు. గతంలో కేవలం పార్టీ అన్నీ చూసుకుంటుంది.. తమ ఇమేజ్ తమను గెలిపిస్తుందని.. ఆయన సహజ ధోరణిలో ఆలోచించారు. అయితే.. గత ఎన్నికల్లో ఈ ఇమేజ్ తనకు కలిసి రాలేదు. అంతేకాదు.. తన వర్గం కూడా తనను కాపాడలేక పోయింది.ఈ పరిణామాలపై గట్టి అంచనా వేసుకున్న యువ నాయకుడు.. కొన్నాళ్లుగా ప్రజల్లోనే ఉంటున్నారు., వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే.. పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్క నేతను పలకరిస్తున్నారు. సీనియ ర్ల సూచనలను కూడా పాటిస్తున్నారు.సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.

ఇది.. పార్టీలో ఇప్పటి వరకు ఉన్న నైరాశ్యాన్ని తగ్గిస్తోంది. యువ నేత బయటకు రావడంతోయువత కూడా ఆయన వెంట తిరుగుతోంది. ఇది ఆయనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా శ్రీరాం గెలుపు ఖాయమని.. రాసిపెట్టుకోవచ్చని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Discussion about this post