కడప అంటే తెలుగుదేశం పార్టీ గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదనే చెప్పాలి. అక్కడ పార్టీ పెద్దగా సత్తా చాటిన సందర్భాలు లేవు. ఎప్పుడో 1999 ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపింది అంతే..మళ్ళీ ఆ జిల్లాలో టిడిపి సత్తా చాటలేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడిపోతునే వచ్చింది. అందులో కొన్ని స్థానాల్లో గెలుపుకు దూరమై చాలా ఏళ్ళు అయింది. అలా గెలుపుకు దూరమైన స్థానాల్లో మైదుకూరు కూడా ఒకటి.
ఇక్కడ టిడిపి గెలిచింది కేవలం రెండు సార్లు మాత్రమే. 1985, 1999 ఎన్నికల్లోనే అక్కడ టిడిపి గెలిచింది. 1999 తర్వాత అసలు టిడిపి గెలవలేదు. అంటే మైదుకూరులో టిడిపి పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక గత రెండు ఎన్నికల్లో అక్కడ వైసీపీ గెలుస్తూ వస్తుంది. వైసీపీ నుంచి శెట్టిపల్లి రఘురామి రెడ్డి గెలుస్తున్నారు. అయితే 1983, 1999 ఎన్నికల్లో ఈయనే టిడిపి నుంచి గెలిచారు. పలుమార్లు టిడిపి నుంచి పోటీ చేసి..కాంగ్రెస్ అభ్యర్ధి డిఎల్ రవీంద్రా రెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఇక 2014 ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్ళిన రఘురామి రెడ్డి..వరుసగా రెండుసార్లు గెలిచారు. రెండు సార్లు గెలిచిన మైదుకూరు జరిగే అభివృద్ధి శూన్యం. గతంలో టిడిపి అధికారంలో ఉండగా టిడిపి నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఇక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏ మాత్రం ఉపయోగం లేదు.

దీంతో మైదుకూరులో సీన్ మారిపోయింది..వైసీపీపై వ్యతిరేకత పెరిగింది.టిడిపి ఆధిక్యంలోకి వచ్చింది. అటు డిఎల్ రవీంద్రా టిడిపి వైపుకు వస్తున్నారు. దీంతో ఈ సారి మైదుకూరులో పసుపు జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది.
