ఏపీలో అధికార వైసీపీ దూసుకెళుతుంది…ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం వైసీపీదే అన్నట్లు పరిస్తితి ఉంది. తాజాగా జరిగిన మినీ పరిషత్ ఎన్నికల్లో సైతం వైసీపీ సత్తా చాటింది. కానీ ఏడు నెలల క్రితం జరిగిన పరిషత్ ఎన్నికల మాదిరిగా ఈ సారి ఫలితాలు రాలేదు. అప్పుడు ఎన్నికల్ని బహిష్కరించింది.పైగా పోటీలో ఉన్నా సరే వైసీపీకి పోటీ ఇవ్వలేకపోయింది. కానీ ఈ సారి పరిస్తితి అలా లేదు. వైసీపీ పైచేయి సాధించినా సరే…టీడీపీ పోటీ గట్టిగానే ఇచ్చింది.

రాష్ట్రంలో 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా వైసీపీ 8, టీడీపీ 3 చోట్ల గెలిచింది. అలాగే 129 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే వైసీపీ 85, టీడీపీ 33 చోట్ల గెలిచింది. అలాగే జనసేన 5, సిపిఎం 2, సిపిఐ, బీజేపీలు ఒకో చోట, ఇండిపెండెంట్లు రెండుచోట్ల గెలిచారు. గతంలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైసీపీ వన్‌సైడ్‌గా విజయం సాధించింది. ప్రతి జిల్లాలోనూ 90 శాతం వరకు మండల పరిషత్‌లని గెలుచుకోగా, ఇక 99 శాతం వరకు జిల్లా పరిషత్‌లని గెలుచుకుంది. అప్పుడు టీడీపీ ఏ మాత్రం పోటీ ఇవ్వలేదు.

కానీ ఈ సారి తమ్ముళ్ళు గట్టిగానే పోరాడారు. వైసీపీ అధికార బలం ఎంత ఉపయోగించిన సరే తమ్ముళ్ళు పొరాడి గెలిచారు. అలాగే తాజాగా వచ్చిన 12 మున్సిపాలిటీల్లో కూడా టీడీపీ మెరుగైన ఫలితాలనే సాధించింది. 10 మున్సిపాలిటీల్లో వైసీపీ, రెండు మున్సిపాలిటీల్లో టీడీపీ గెలిచింది. అయితే వైసీపీ గెలిచిన మున్సిపాలిటీల్లో టీడీపీ చాలా గట్టి ఫైట్ ఇచ్చింది.

మొత్తం మీద చూస్తే..టీడీపీ ఇప్పుడుప్పుడే పికప్ అవుతుందని తెలుస్తోంది. అలాగే వైసీపీపై ప్రజా వ్యతిరేకత కూడా కాస్త పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. అసలు వైసీపీ అధికార బలాన్ని ఉపయోగించుకుండా బరిలో దిగితే ఫలితాలు ఎలా వచ్చాయో ఊహించవచ్చు. ఏదేమైనా రాష్ట్రంలో మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ ఇంకా పోరాడితే మంచి ఫలితాలు వస్తాయి.

Discussion about this post