జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానంపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఉన్న దే చాలా తక్కువ మంది నాయకులు. అయినప్పటికీ.. వారిలో జోష్ ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం.. ప్రజలకు అధినాయకుడు.. చేస్తున్న సాయం కానీ.. రాష్ట్రంలో చేస్తున్న రాజకీయాలు కానీ.. ఏవీ కూడా సక్రమంగా సాగడం లేదని ఎక్కువ మంది భావిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు.

రాష్ట్రంలో మొత్తంగా.. అన్ని జిల్లాల్లోని కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి.. వారిలో భరోసా నింపా లని ఆయన నిర్ణయించారు. ఈ క్రమంలోనే గత ఏప్రిల్‌లో ఈ కార్యక్రమానికి పవన్ శ్రీకారం చుట్టారు. ప్రతి కౌలు రైతుల కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇది మంచిదే.. ఓటు బ్యాంకు రాజకీయాలను చూసుకున్నప్పుడు.. రైతులను మించిన సెంటిమెంటు అస్త్రం మరొకటి ఉండదు. సో.. పవన్ ఎంచుకున్న మార్గం మంచిదేననే అభిప్రాయం అందరిలోనూ ఉంది.

పైగా ఆర్థిక సాయం చేయడాన్ని కూడా వారు స్వాగతిస్తున్నారు. కానీ,ఈ చేస్తున్న సాయం.. ఒకేసారి.. ఓ వారం రోజులో.. పది రోజులో.. లేక 15 రోజులో పర్యటించి.. వరుసగా.. పర్యటనలు చేసి.. సాయం అందిస్తే.. రాజకీయంగా మంచి బూమ్ వస్తుందని.. నాయకులు అంటున్నారు. కానీ, నెలకు ఒకసారి.. ఒక జిల్లాలో పర్యటించి చేస్తున్న సాయం కారణంగా.. ఆశించిన మేరకు పేరు రావడం లేదని.. నాయకులు వాపోతున్నారు. చేస్తున్న సాయం వల్ల రాజకీయంగా కూడా ఎలాంటి బూమ్ పెరగడం లేదని చెబుతున్నారు.

“ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా మేం కౌలు రైతులకు దాదాపు 5 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇది చాలా మంచి కార్యక్రమం. కానీ, విడతల వారీ చేస్తుండడంతో అనుకున్న విధంగా మైలేజీ రావడం లేదు. విడతల వారీగా కాకుండా.. ఒకే సారి ఈ సాయం చేస్తే.. పార్టీకి అనుకున్న విధంగా మైలేజీ వస్తుంది. ఈ దిశగా మా నాయకుడు.. ఆలోచించాలి“ అని ఒక కీలక నాయకుడు వ్యాఖ్యానించారు. మరి దీనిని బట్టి పవన్ ఒక నుంచయినా.. చేసే కార్యక్రమాలు మైలేజీ వచ్చేలా రూపొందిస్తారో లేదో చూడాలి.

Discussion about this post