పొత్తుపై అటు చంద్రబాబు-ఇటు పవన్ కల్యాణ్ దాదాపు క్లారిటీ గానే ఉన్నారనే చెప్పవచ్చు. పొత్తు ఉంటే వైసీపీకి ఇంకా ఈజీగా చెక్ పెట్టవచ్చు అని ఇద్దరు నాయకులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఇద్దరు నేతలు ఇటీవల కాలంలో రెండుసార్లు భేటీ అయ్యారు. అయితే కలిసి వైసీపీ అరాచక విధానాలపై పోరాటం చేస్తామని చెప్పారు. కానీ పొత్తుపై మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే తాజాగా శ్రీకాకుళం సభలో పవన్ పొత్తు గురించి దాదాపు క్లారిటీ ఇచ్చేసినట్లే కనిపిస్తున్నారు. ఒంటరిగా వెళ్ళి వీర మరణం పొందడం అనవసరమని, పరిస్తితులు బట్టి వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలని, అది కూడా గౌరవమైన పొత్తులు ఉంటాయని చెప్పుకొచ్చారు. దీని బట్టి చూస్తే పవన్ పొత్తుపై దాదాపు క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు. అటు చంద్రబాబు సైతం పొత్తుకు రెడీగా ఉన్నారు. ఇక టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకి నష్టం జరగడం గ్యారెంటీ. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు లేకపోవడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగింది.

దాదాపు 53 సీట్లలో జనసేన ఓట్లు ఎక్కువ చీల్చిందని తాజాగా పవనే చెప్పారు. అంటే ఆ సీట్లలో వైసీపీకి టీడీపీపై వచ్చిన మెజారిటీల కంటే..జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ అని తెలుస్తోంది. ఇక అప్పుడే పొత్తు ఉంటే వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చేవి కాదు. అందుకే ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని అటు బాబు, ఇటు పవన్ ఆలోచిస్తున్నారు. పొత్తు దిశగా ముందుకెళుతున్నారు. ఇక పొత్తు దాదాపు ఫిక్స్ అయింది..కానీ సీట్ల పంపకాలే తేలాలి.
