రాష్ట్రంలో అధికంగా ఉన్న కాపులని జగన్‌కు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే చెప్పొచ్చు. రాష్ట్రంలో కాపు, బలిజ, ఒంటరి, తెలగ ఓటర్లు అధికంగా ఉన్నారు. వీరే గెలుపోటములని డిసైడ్ చేస్తారు. గత ఎన్నికల్లో వీరు పూర్తిగా వైసీపీకి మద్ధతు ఇచ్చారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వీరికి ఒరిగింది ఏమి లేదు…కొద్దో గొప్పో చంద్రబాబే కాస్త మంచిగా పనిచేశారనే భావన…ఆ వర్గాల్లో వస్తుంది.

ఇదే క్రమంలో కాపు వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ సైతం…ఈ సారి తన రాజకీయాన్ని పూర్తిగా మార్చేశారు. ఇంతకాలం అన్నీ కులాలు అన్నట్లుగా మాట్లాడే పవన్..ఈ మధ్య కాపులకు రాజ్యాధికారం దక్కాలని మాట్లాడుతున్నారు. మిగిలిన కులాలని కలుపుకుని కాపులు అధికారంలోకి రావాలని కోరుతున్నారు. ఇక పవన్ దెబ్బకు..కాపుల్లో కాస్త మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. వారు ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు.

ఇదే సమయంలో కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య…జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేశారు. కాపులకు జగన్ న్యాయం చేయడం లేదని మాట్లాడుతున్నారు. అలాగే చంద్రబాబు కాస్త కాపులకు న్యాయం చేశారనే కోణంలో మాట్లాడుతున్నారు. ఎలాగో కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉన్నాయి. అయితే కేంద్రం వెనకబడిన అగ్రవర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది.

ఇక అందులో గత చంద్రబాబు ప్రభుత్వం 5 శాతం కాపులకు, మిగిలిన 5 శాతం ఇతర అగ్రవర్గాలకు కేటాయించారు. సమాజంలో కాపులు ఎక్కువగా ఉండటంతోనే వారికి 5 శాతం కేటాయించారు.
కానీ జగన్ అధికారంలోకి వచ్చాక…అది పూర్తిగా లేపేశారు. కాపులకు 5 శాతం తీసేశారు. దీంతో ఇప్పుడు కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లని కొనసాగించాలని జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై కాపులకు కూడా అవగాహన వస్తుంది. జగన్ ప్రభుత్వం న్యాయం చేయడం లేదని క్లారిటీ వస్తుంది. అందుకే నిదానంగా కాపులు జగన్‌కు దూరం అవుతున్నారు. అదే సమయంలో బాబు-పవన్‌లు కలిస్తే…కాపుల మద్ధతు వీరికే ఎక్కువగా వచ్చేలా ఉంది.

Discussion about this post