ఏపీలో జనసేనకు పూర్తి స్థాయిలో బలం లేదనే సంగతి తెలిసిందే..ఏదో గోదావరి జిల్లాలు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల వరకు జనసేనకు బలం ఉంది తప్ప..మిగిలిన జిల్లాలపై పెద్దగా పట్టు లేదు. అసలు రాయలసీమలో అయితే చెప్పనవసరం లేదు..జనసేనకు ఏ మాత్రం బలం లేదు. కాకపోతే కొద్దో గొప్పో చిత్తూరు జిల్లాలో జనసేనకు 10 వేల ఓట్లు పైనే పడే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి.

గత ఎన్నికల్లో నాలుగైదు నియోజకవర్గాల్లో జనసేనకు 10 వేల పైనే ఓట్లు పడ్డాయి. అయితే ఆ ఓట్లని మరింత పెంచుకోవాలని చెప్పి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో తిరుపతి నియోజకవర్గంపై పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తిరుపతిలో పవన్ సొంత సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి..అలాగే 2009లో ఇక్కడ చిరంజీవి గెలిచారు. అందుకే దీనిపై ఆయన ఫోకస్ పెట్టారని సమాచారం.అయితే ఇప్పటికే తిరుపతిలో పవన్ పోటీ చేయొచ్చని ప్రచారం కూడా వస్తుంది. కానీ పవన్ పోటీ చేసే విషయం అధికారికంగా క్లారిటీ లేకపోయినా, తిరుపతిలో మాత్రం జనసేన గెలవాలనే పట్టుదలతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. కాకపోతే జనసేన ఎంత కష్టపడిన సింగిల్‌గా తిరుపతిలో గెలవడం జరిగే పని కాదు. ఇక్కడ టీడీపీ-వైసీపీలని దాటి జనసేన గెలుపు సాధ్యం కాదు. అయితే టీడీపీతో గాని పొత్తు పెట్టుకుని, తిరుపతి సీటు తీసుకుంటే జనసేనకు ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి.

కానీ తిరుపతి సీటుని టీడీపీ వదులుకునే అవకాశాలు తక్కువ. ఎందుకంటే గత ఎన్నికల్లో కేవలం 700 ఓట్ల తేడాతోనే టీడీపీ ఓడిపోయింది. కాబట్టి అలాంటి సీటుని వదులుకోవడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. తిరుపతి పార్లమెంట్ సీటు ఇవ్వొచ్చు..కానీ అసెంబ్లీ సీటు కష్టం. కాకపోతే పవన్ కల్యాణ్ డైరక్ట్‌గా తిరుపతి బరిలో దిగితే మాత్రం టీడీపీ ఛాన్స్ ఇవ్వొచ్చు. కానీ ఏదేమైనా టీడీపీ-జనసేనలు కలిస్తేనే మాత్రం తిరుపతిలో గెలవగలవు.
Discussion about this post