ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి పట్టు ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ బీసీ, కాపు వర్గాలు మొదట నుంచి టిడిపికి అండగా ఉంటూనే వస్తున్నారు. కానీ 2009లో ప్రజారాజ్యం, 2019లో జనసేన వల్ల ఓట్లు భారీగా చీలి టిడిపికి నష్టం జరిగింది. అయితే ఈ సారి ఆ పరిస్తితి ఉండదు..టిడిపి, జనసేన కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ పొత్తులో తూర్పులో వైసీపీకి చెక్ పెట్టడం ఖాయమే.
ఇక పొత్తులో భాగంగా జనసేనకు తూర్పులో ఎన్ని సీట్లు దక్కుతాయో క్లారిటీ లేదు. కానీ జూన్ 14 నుంచి జనసేనకు అనుకూలంగా ఉన్న సీట్లలో పవన్ పర్యటించనున్నారు. ప్రత్తిపాడులో పర్యటన మొదలవుతుంది. పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో పవన్ పర్యటన కొనసాగుతుంది. అయితే ఈ సీట్లు దాదాపు జనసేనకు మంచిగా ఓట్లు వచ్చిన నియోజకవర్గాలే. 2019లో ఆయా సీట్లలో జనసేనకు 30-40 వేల ఓట్లు వరకు పడ్డాయి. రాజోలు సీటుని గెలుచుకున్నారు.

కానీ ఒక్క ప్రత్తిపాడులో జనసేనకు పెద్ద ఓటు బ్యాంకు లేదు. గత ఎన్నికల్లో దాదాపు 7 వేలు ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక ఇక్కడ నుంచి పవన్ పర్యటన మొదలుపెట్టిన ఈ సీటు మాత్రం టిడిపికే దక్కనుంది. గత రెండు ఎన్నికల్లో చాలా స్వల్ప మెజారిటీలతో టిడిపి ఓడిపోయింది. 2014లో 3 వేలు, 2019లో 4 వేల ఓట్ల తేడాతో ఓడింది.
ఈ సారి ఇక్కడ గెలవాలని మొన్నటివరకు టిడిపి నేత వరుపుల రాజా పనిచేస్తూ వచ్చారు. కానీ ఆ మధ్య గుండెపోటుతో మరణించారు. దీంతో ప్రత్తిపాడు ఇంచార్జ్ గా రాజా భార్య సత్యప్రభని నియమించారు. సీటు కూడా ఆమెకే దక్కనుంది. పైగా రాజా చనిపోయిన సెంటిమెంట్ ఉంది..కాబట్టి ప్రత్తిపాడు సీటు టిడిపిదే..ఈ సారి గెలుపు కూడా డౌట్ లేదు.