అవును నిజమే పవన్ కల్యాణ్ గాని సపోర్ట్ చేయకపోతే చాలామంది తెలుగు తమ్ముళ్ళు మళ్ళీ గెలుపు గుర్రం ఎక్కడం కష్టమనే చెప్పాలి. గత ఎన్నికల్లో అదే జరిగిన విషయం తెలిసిందే. జనసేన సెపరేట్‌గా పోటీ చేసి ఓట్లు చీల్చి టీడీపీ ఓటమికి కారణమైంది. ఇక నెక్స్ట్ కూడా జనసేన అలాగే విడిగా పోటీ చేస్తే చాలామంది టీడీపీ నేతలు ఓటమి పాలవుతారు. ముఖ్యంగా తూర్పు గోదావరి తమ్ముళ్ళు చేతులెత్తేయడం ఖాయం.

దాదాపు సగం సీట్లలో టీడీపీ నేతలు, జనసేన వల్లే ఓడిపోయేలా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా అదే జరిగింది. జిల్లాలో మొత్తం 19 సీట్లు ఉంటే వైసీపీ 14, టీడీపీ 4, జనసేన ఒక సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ 14 సీట్లలో సగంపైనే సీట్లలో జనసేన ఓట్లు చీల్చేసి టీడీపీ ఓటమికి కారణమైంది. అదే అప్పుడు టీడీపీతో జనసేన కలిసి ఉంటే వైసీపీకి 14 సీట్లు వచ్చేవి కాదు. మెజారిటీ సీట్లు టీడీపీ-జనసేనలే గెలుచుకునేవి.

నెక్స్ట్ ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయితే మాత్రం.. టీడీపీ ఎక్కువ సీట్లు నష్టపోవాల్సి ఉంటుంది. అంటే పవన్ కల్యాణ్ మద్ధతు ఇస్తే…టీడీపీ నేతలు గెలవడం ఖాయమని చెప్పొచ్చు. అలాగే జనసేనకు కూడా కొన్ని సీట్లు వస్తాయి. అలా రెండు పార్టీలు కలిస్తే కాకినాడ రూరల్, సిటీ, అమలాపురం, కొత్తపేట, ముమ్మిడివరం, పిఠాపురం, పి.గన్నవరం, ప్రత్తిపాడు సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.

ఎలాగో టీడీపీ చేతిలో రాజమండ్రి సిటీ, రూరల్, మండపేట, పెద్దాపురం సీట్లు ఉన్నాయి…ఈ సీట్లలో కూడా టీడీపీకి గెలిచే ఛాన్స్ ఉంటుంది. అటు రాజోలులో మళ్ళీ జనసేన గెలిచే ఛాన్స్ వస్తుంది. అయితే ఇదంతా టీడీపీ-జనసేనలు కలిస్తేనే జరుగుతుంది..అలా కాకుండా రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే మాత్రం తూర్పులో మళ్ళీ వైసీపీదే పైచేయి అవుతుంది.

Discussion about this post