పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ స్ట్రాటజీ మారుస్తున్నట్లు కనిపిస్తున్నారు..మొన్నటివరకు ఏమో పొత్తు విషయంలో మూడు ఆప్షన్స్ అంటూ మాట్లాడిన ఆయన…తాజాగా పొత్తు ఎవరితోనూ లేదని, తన పొత్తు ప్రజలతోనే అని చెప్పి మాట్లాడారు. అంటే ఆయన పొత్తులపై సరిగ్గా క్లారిటీ ఇవ్వడం లేదని చెప్పాలి..మరి ఇదంతా కావాలని చేస్తున్నారు లేక…తన ఆలోచన మార్చుకుంటున్నారా? అనేది తెలియడం లేదు.

వాస్తవానికి గత కొంతకాలం నుంచి పొత్తుల గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. గతంలో చంద్రబాబు కుప్పంలో పొత్తుల గురించి మాట్లాడుతూ…వన్ సైడ్ లవ్ ఉంటే సరిపోదని అన్నారు. ఇక దీనిపై జనసేన శ్రేణులు స్పందిస్తూ…పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తేనే పొత్తు పెట్టుకుంటామని టీడీపీ ముందు డిమాండ్లు పెట్టారు. ఇక దీనికి టీడీపీ కౌంటర్లు ఇచ్చింది….అసలు 40 శాతంపైనే ఓట్లు ఉన్న తాము పవన్ ని సీఎం అభ్యర్ధిగా ఎలా ప్రకటిస్తామని మాట్లాడారు…అవసరమైతే సింగిల్ గా పోటీ చేస్తాం గాని…పొత్తు పెట్టుకోమని టీడీపీ శ్రేణులు తేల్చి చెప్పేసాయి.ఇక ఇటీవల పవన్…పొత్తుకు సంబంధించి మూడు ఆప్షన్స్ ఇచ్చారు..జనసేన-బీజేపీ పోటీ చేయడం, రెండోది..టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయడం…ఇక మూడోది జనసేన సింగిల్ గా పోటీ చేయడం అని చెప్పారు. అయితే పొత్తు పెట్టుకుంటే తాము తగ్గమని, టీడీపీనే తగ్గాలి అన్నట్లు మాట్లాడారు. ఇక దీనికి టీడీపీ శ్రేణులు కూడా కౌంటర్లు ఇచ్చేశాయి…తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, సింగిల్ గా గెలిచే సత్తా తమకు ఉందని చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా పవన్…పొత్తు ఉండదన్నట్లు చెప్పుకొచ్చారు…ఒకవేళ సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే పొత్తు పెట్టుకుంటామన్నట్లు జనసేన వైఖరి ఉంది. అంటే పొత్తుపై తేల్చాల్సింది చంద్రబాబు…కానీ జనసేన ఇలాంటి డిమాండ్ తో ముందుకొస్తే..ఖచ్చితంగా టీడీపీ పొత్తు పెట్టుకోదు…ఇందులో ఎలాంటి డౌట్ లేదు..కాబట్టి పొత్తు విషయంలో బాబు ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి. మరి టీడీపీ-జనసేన పొత్తు సెట్ అవుతుందో లేదో చూడాలి.
Discussion about this post