March 28, 2023
పవన్‌కు బాబు ఆ ఛాన్స్ ఇచ్చేనా..పొత్తు లెక్క ఇదే!
ap news latest AP Politics

పవన్‌కు బాబు ఆ ఛాన్స్ ఇచ్చేనా..పొత్తు లెక్క ఇదే!

ఎలాగైనా వైసీపీని నెక్స్ట్ అధికారంలోకి రానివ్వకూడదని చెప్పి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాగా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ సారి వైసీపీని ఓడిస్తామని పవన్ అంటున్నారు. అయితే గత ఎన్నికల్లో జనసేనకు బలం ఉన్నా సరే ఓట్లు చీలిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చిందని, కానీ ఈ సారి ఆ పరిస్తితి రానివ్వమని, వ్యతిరేక ఓట్లని చీలనివ్వను అని, వైసీపీ వ్యతిరేక శక్తులని ఏకం చేస్తామని చెబుతున్నారు.

అంటే టీడీపీతో కలిసి ముందుకెళ్ళాల్సిందే. ప్రస్తుతం పవన్..బీజేపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీతో పొత్తు వల్ల పవన్‌కు పావలా ఉపయోగం లేదు. గెలవడం పక్కన పెడితే..కనీసం 10 సీట్లు గెలుచుకోవడం కష్టం. పైగా ఓట్లు చీలిపోయి టీడీపీకి నష్టం, వైసీపీకి లాభం జరుగుతుంది. అందుకే పవన్ ఈ సారి టీడీపీతో కలిసి ముందుకెళ్లడానికి రెడీ అయ్యారు..అటు టీడీపీ సైతం పవన్‌తో పొత్తుకు సై అంటుంది. ఈ పొత్తులో బీజేపీ కలిసొస్తే ఓకే..లేకపోయినా టీడీపీ-జనసేన కలిసి వెళ్ళేలా ఉన్నాయి.

అయితే వైసీపీని ఓడించే క్రమంలో పవన్..టీడీపీతో పొత్తు పెట్టుకుంటే సీఎం సీటు త్యాగం చేయాల్సిందే. ముందు వైసీపీ ఓటమి అంటున్నారు..ఆ తర్వాత ప్రజల గుండెల్లో ఉంటే సీఎం అవుతానని చెబుతున్నారు. వైసీపీ ఓటమి కోసం పనిచేయాలంటే సీఎం సీటు దక్కదు. ఎందుకంటే టీడీపీ మేజర్ పార్టీ..చంద్రబాబు ఉండగా, సీఎం సీటు వదులుకుని పొత్తుకు వెళ్లారు.

సీట్ల విషయంలో ఏమైనా కాంప్రమైజ్ అవుతారు గాని..సీఎం సీటు విషయంలో అవ్వరు. అవసరమైతే పొత్తు వదులుకుంటారు. అలాంటప్పుడు పవన్ సీఎం సీటు వదులుకుని పొత్తు కోసం ముందుకు రావాలి. అలా జరగకపోతే బీజేపీతో కలిసి పవన్ పోటీ చేయాలి..అప్పుడు జనసేన గెలవదు..టీడీపీని గెలవనివ్వదు..పరోక్షంగా వైసీపీకి మీలు జరుగుతుంది. మరి చూడాలి పొత్తుల విషయంలో పవన్ ఎలా ముందుకెళ్తారో. 

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video