ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి భయపెడుతుంది. ఇప్పటికే మూడు వేవ్‌లతో భారతదేశాన్ని ఇబ్బంది పెట్టిన కరోనా..నాలుగు వేవ్‌తో విరుచుకుపడటానికి రెడీగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చైనాతో పాటు పలు దేశాలని వణికిస్తున్న మహమ్మారి..ఇండియాలో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే మరోసారి కరొణా ఉదృతి ఉంటునని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అన్నీ రాష్ట్రాలకు సూచించింది.

అయితే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించింది. ఇంకా ఎలాంటి ఆంక్షలు చెప్పలేదు. మరి రానున్న రోజుల్లో ఏమైనా ఆంక్షలు పెడతారేమో చూడాలి. ఆ విషయం పక్కన పెడితే..ఈ కరోనా అనే అస్త్రాన్ని వాడి ఏపీలో అధికార వైసీపీ..ప్రతిపక్షాలని జనాల్లో తిరగకుండా చేసే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రెండేళ్ళు పైనే ప్రతిపక్షాలని కరోనా ఆంక్షలతో కట్టడి చేశారు.

కానీ అధికార వైసీపీ నేతలు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. పోలీసులు సైతం కరోనా ఆంక్షలు అని చెప్పి ప్రతిపక్ష నేతలని కట్టడి చేశారు. అయితే మళ్ళీ అవే ఆంక్షలతో ప్రతిపక్ష నేతలకు చెక్ పెడతారా? అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎన్నికల సీజన్ దగ్గర పడింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం జనంలోనే ఉంటున్నారు. ఆయన పర్యటనలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది. ఇక అటు నారా లోకేష్ జనవరి 27 నుంచి పాదయాత్రకు రెడీ అవుతున్నారు. అలాగే పవన్ బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు. మరి అప్పటికి కరోనా ప్రభావం లేకపోతే ఇబ్బంది లేదు..అలా కాకుండా కాస్త ప్రభావం ఉంటే..లోకేష్, పవన్‌లని ఆంక్షలతో కట్టడి చేయడం ఖాయమని అంటున్నారు. వారికి జనాల్లో ఆదరణ రాకుండా చేయాలంటే వారికి ఇలాగే బ్రేకులు వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో పరిస్తితి ఎలా ఉంటుందో.



Leave feedback about this