సినీ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌పై ఇష్టారాజ్యంగా కథనాలు వేస్తూ పలు తెలుగు మీడియా సంస్థలు హడావిడి చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్…తాజాగా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్‌లో తీవ్రంగా ఫైర్ అయ్యారు. మీడియాకు ఇంకా ఏ సమస్యలు కనబడనట్లుగా తేజ్ గురించి హడావిడి చేశారనే విధంగా మాట్లాడారు.

ఈ సందర్భంగానే పవన్ ఓ కీలక అంశాన్ని లేవనేత్తారు. గతంలో టిడిపి అధికారంలో ఉండగా కాపు రిజర్వేషన్ల అంశం గురించి ఎంత రచ్చ చేశారో అందరికీ తెలిసిందే. ముద్రగడ పద్మనాభం లాంటి వారు బాగానే హడావిడి చేశారు. అయితే కాపు రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి పంపింది. అది కేంద్ర పరిధిలో ఉండిపోయింది. ఈ క్రమంలోనే కేంద్రం వెనుకబడిన అగ్రవర్గాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ కేటాయించింది. ఇక దీంతో చంద్రబాబు ప్రభుత్వం కాపులకు 5 శాతం కేటాయించింది.

కానీ జగన్ వచ్చాక దీన్ని కూడా ఎత్తేశారు. అలాగే కాపు రిజర్వేషన్లు అంశం పక్కకు వెళ్లిపోయింది. దీన్నే పవన్ ప్రశ్నించారు. టిడిపి ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్లు గురించి హడావిడి చేసిన వ్యక్తులు, మీడియా సంస్థలు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎందుకు నోరు మెదపడం లేదని అన్నారు. తేజ్ గురించి హడావిడి చేసే మీడియాలు…కాపు రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు.

అంటే అప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి అందరూ ఏకమై కాపు రిజర్వేషన్లు అంటూ హడావిడి చేశారని అర్ధమవుతుంది. తర్వాత జగన్ అధికారంలోకి రాగానే వారు సైలెంట్ అయిపోయారు. జగన్ కోసం అప్పుడు రాజకీయం చేసినట్లు కనిపిస్తోంది.

Discussion about this post