కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం…తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన నియోజకవర్గాలో ఇదీ ఒకటి. గుంటూరు జిల్లాకు బోర్డర్‌లో ఉండే ఈ దివిసీమలో ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. మొదట నుంచి టీడీపీలో పనిచేసిన సింహాద్రి ఫ్యామిలీ వారసుడు రమేష్ బాబు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొదట నుంచి కాపు సామాజికవర్గం ప్రభావం ఎక్కువ…అందుకే ఇక్కడ ఆ వర్గానికి చెందిన నాయకులే మొదట నుంచి తలపడుతున్నారు.

ముఖ్యంగా మండలి, సింహాద్రి ఫ్యామిలీలు తలపడుతూ వస్తున్నాయి. అనేక ఎన్నికల్లో సింహాద్రి ఫ్యామిలీ టీడీపీ నుంచి, మండలి ఫ్యామిలీ కాంగ్రెస్ నుంచి పోటీకి దిగాయి. కానీ రాష్ట్ర విభజన తర్వాత పరిస్తితి మారింది మండలి ఫ్యామిలీ టీడీపీలోకి రాగా, సింహాద్రి ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్లింది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున మండలి బుద్ధప్రసాద్, వైసీపీ తరుపున సింహాద్రి రమేష్ పోటీ చేశారు. అప్పుడు విజయం మండలిని వరించింది.

అయితే 2019 ఎన్నికల్లో సీన్ మారింది…జగన్ గాలిలో రమేష్ వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచేశారు. కాకపోతే ఇక్కడ జనసేన ప్రభావం వల్ల మండలికి నష్టం జరిగింది. జనసేనతో ఓట్లు చీలిపోయి రమేష్ సునాయసంగా గెలిచేశారు. రమేష్…మండలిపై 20 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ ఇక్కడ జనసేనకు 28 వేల పైనే ఓట్లు పడ్డాయి. అంటే జనసేన ప్రభావంతో మండలికి ఓటమి తప్పలేదు.

అయితే ఈ సారి అలాంటి పరిస్తితి రాకూడదు అంటే..ఖచ్చితంగా పవన్ కల్యాణ్ టీడీపీకి మద్ధతు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఇక్కడ మండలి విజయం సులువు అవుతుంది. ఎలాగో ఇక్కడ జనసేనకు గెలిచే సత్తా లేదు. అలాంటప్పుడు విడిగా పోటీ చేసి టీడీపీ గెలుపుని దెబ్బతీసే బదులు..ఆ పార్టీకి సపోర్ట్ ఇస్తే వైసీపీకి చెక్ పెట్టొచ్చు. ఒకవేళ జనసేన మళ్ళీ విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి వైసీపీకే బెనిఫిట్ కానుంది. కాబట్టి పవన్ సపోర్ట్ ఇస్తే దివిసీమలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం.

Discussion about this post