టీడీపీ-జనసేన పొత్తుగాని సెట్ అయితే మొదట రిస్క్‌లో పడే వైసీపీ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే..ఆయనపై టీడీపీ-జనసేన శ్రేణులు ఎంత కోపంగా ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు..అసలు చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లని ఎంత దారుణంగా తిట్టారో అందరికీ తెలిసిందే. ఒకసారి చంద్రబాబు-పవన్‌లని పచ్చి బూతులు తిట్టారు..అలాగే జనసేన కార్యకర్తలని కొట్టించారు..ఇక ఈయన చంద్రబాబుని ఉద్దేశించి అసెంబ్లీలో ఎలా దారుణంగా మాట్లాడారో తెలిసిందే. భువనేశ్వరిని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడిన మాటలు అందరికీ తెలుసు.

ఇక ఈయన అక్రమాలు కూడా ఎక్కువే అని టీడీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నాయి..అందుకే ద్వారంపూడి అంటే …టీడీపీ-జనసేనలకు కోపం ఎక్కువే..ఆయనకు ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నాయి. తాజాగా కూడా పవన్..ద్వారంపూడి పై ఘాటుగానే స్పందించారు. అయితే ద్వారంపూడి సైతం గట్టిగానే రియాక్ట్ అయ్యారు.. జనసేన పార్టీ కార్యకర్తలు తన ఇంటిపై దాడికి వచ్చారని.. అయినా ఏమీ చేయలేక పోయారని, పవన్ నా వెంట్రుక కూడా పీకలేడు అని దారుణంగా మాట్లాడారు.

ఇక ద్వారంపూడి వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు గట్టిగానే ఫైర్ అవుతున్నారు…పవన్ ఏం పీకుతారో చూపిస్తారని, 2024 ఎన్నికల్లో ద్వారంపూడి సీటు పీకేస్తామని అంటున్నారు. అసలు ద్వారంపూడి రెండు సార్లు ఎమ్మెల్యే అవ్వడానికి కారణం ఓట్లు చీలిపోవడమే అని, 2009లో ప్రజారాజ్యం వల్ల ఓట్లు చీలిపోయి…ద్వారంపూడికి బెనిఫిట్ అయిందని, ఇక 2019 ఎన్నికల్లో కూడా జనసేన వల్ల ఓట్లు చీలిపోయి ద్వారంపూడి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచేశారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.

అంటే ఇక్కడ ద్వారంపూడి ఓడిపోవాలంటే…టీడీపీ-జనసేనలు కలవాల్సిందే అంటున్నారు. అయితే రెండు పార్టీల మధ్య దాదాపు సెట్ అవుతున్న విషయం తెలిసిందే..ఇక పొత్తు గాని అధికారికంగా సెట్ అయితే మొదటి టార్గెట్ ద్వారంపూడి అవుతారు..రెండు పార్టీలు గాని కలిస్తే కాకినాడ సిటీలో ద్వారంపూడికి మరోసారి గెలిచే అవకాశం ఏ మాత్రం లేదు.

Discussion about this post