పవన్‌తో పొత్తు పార్టీకి కలిసివస్తుందా? పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఇదీ.. ఇప్పుడు టీడీపీ నేతల మధ్య జరుగుతున్న కీలకమైన చర్చ. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా జనసేనాని పవన్ చేసి న ప్రకటన సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభత్వ వ్యతిరేక ఓటు చీల్చనని చెప్పడం ద్వారా టీడీపీ వంటి బలమైన పార్టీతో ఆయన చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చినట్టు అయింది. ఈ నేపథ్యంలో పవన్‌తో కలిసి ముందుకు సాగితే.. టీడీపీ పుంజుకుంటుందా? అనే చర్చ తమ్ముళ్ల మధ్య ఆసక్తిగా మారింది.

ఇప్పటి వరకు టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసింది లేదు. 2014లో జనసేన పరోక్షంగా.. టీడీపీకి బయట నుంచి మద్దతు ప్రకటించింది. 2019 ఎన్నికలకు వచ్చే సరికి మాత్రం.. దూరమై.. ఎవరికి వారుగా పోటీ చేశారు. అంటే.. ఎక్కడా టీడీపీతో జనసేన కలిసి పోటీ చేసింది లేదు. ఇక, ఇప్పుడు కలిసి పోటీ చేసే దిశగా అడుగులు వేయాలని జనసేన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇది కలిసి వస్తుందా? అనేది తమ్ముళ్ల చర్చ. దాదాపు పవన్‌తో భేటీ కట్టడం ద్వారా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోకుండా.. కాపాడు కునేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు.

అదేసమయంలో కాపు సామాజిక వర్గం ఓట్లు, ఎస్సీ ఓట్లు కూడా పవన్‌కు అనుకూలంగా ఉన్న నేపథ్యం లో.. ఇప్పుడు ఆయా సామాజిక వర్గాలు.. టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందని లెక్కలు వేసుకుంటున్నా రు. ఇదే జరిగితే.. టీడీపీకి అధికారం ఖాయమని చెబుతున్నారు. మరి పొత్తుగా ఉన్న జనసేనకు కూడా న్యాయం చేయాలి కాబట్టి.. కొన్ని సీట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ.. జనసేనతో పొత్తుతో టీడీపీకి మేలు జరుగుతుందని.. వ్యతిరేక ఓటు సహా.. సామాజిక వర్గాల కూర్పు టీడీపీకి అనుకూలంగా మారుతుందని.. అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Discussion about this post