ఏపీ రాజకీయాల్లో నేతలు హద్దులు దాటి మరీ బూతుల యుద్ధం చేస్తున్నారు. సినిమా టికెట్లపై పవన్ ప్రశ్నించిన దగ్గర నుంచి వైసీపీ నేతలు గానీ, పోసాని మురళీకృష్ణ లాంటి వారు గానీ ఏ విధంగా పవన్‌ని తిడుతున్నారో అందరికీ తెలిసిందే. అయితే పవన్ రిపబ్లిక్ ఫంక్షన్‌లో మాట్లాడేప్పుడు పలు సమస్యలని ప్రశ్నిస్తూ…వైసీపీ మంత్రులని సన్నాసులు అని తిట్టారు. ఇక అంతే వరుసపెట్టి వైసీపీ మంత్రులు పవన్ని బూతులు తిడుతున్నారు.

ఆయన పలు సమస్యల గురించి ప్రశ్నిస్తుంటే చాలు…వాటికి సమాధానం చెప్పకుండా నేతలు, పోసాని లాంటి వారు బూతులు తిడుతున్నారు. అసలు ఎలాంటి సందర్భం లేకుండా పోసాని మీడియా సమావేశంలో ఓ పంజాబీని మోసం చేశారని చెప్పుకొచ్చారు. ఇలా రాజకీయంగా సంబంధం లేకుండా మాట్లాడిన పోసానిపై పవన్ అభిమానులు, జనసైనికులు ఫైర్ అవుతున్నారు.

వాళ్ళు కూడా పోసానిని బూతులు తిడుతున్నారు. ఆయనకు ఫోన్ చేసి మరీ అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఆ విషయాన్ని పోసాని స్వయంగా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. పవన్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతోనే పోసానిపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారని తెలుస్తోంది. అయితే అంతకంటే ఎక్కువగా పోసాని, పవన్ ఫ్యామిలీని ఉద్దేశించి బూతులు తిట్టారు. దీంతో ఫ్యాన్స్ మరింతగా రెచ్చిపోయి పోసానిపై విరుచుకుపడుతున్నారు.

అయితే సడన్‌గా పోసాని ఎంట్రీ ఇచ్చి, రాజకీయంగా మాట్లాడకుండా పవన్ వ్యక్తిగత విషయాలని ప్రస్తావించడం వెనుక ఓ కుట్ర ఉందని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలని జగన్ అమలు చేస్తున్నారని, పవన్‌ని, ఆయన అభిమానులని రెచ్చగొట్టి పక్క దారి పట్టించడానికే ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని అంటున్నారు.

గతంలో కత్తి మహేష్, శ్రీరెడ్డి లాంటి వారు పవన్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శించారని, వారికి పవన్ అభిమానులు కౌంటర్లు ఇస్తా కూర్చున్నారు గానీ, పార్టీని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల పెద్ద నష్టం జరిగిందని, ఇప్పుడు పోసాని అదే స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారని, ఫ్యాన్స్ ఆ మాయలో పడొద్దని అంటున్నారు.

Discussion about this post