అధికార వైసీపీలో బాగా వివాదాస్పదమైన ఎమ్మెల్యేల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకరని చెప్పవచ్చు. ఎప్పుడైతే చంద్రబాబు, పవన్లని వ్యక్తిగతంగా బూతులు తిట్టడం, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం, అసెంబ్లీలో చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి దారుణంగా మాట్లాడటం, తన ఇంటి వద్ద నిరసన తెలియజేసిన జనసేన శ్రేణులపై దాడులు చేయడం..అలాగే కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా బియ్యం ఎగుమతులు చేయిస్తున్నారని ఆరోపణలు ఎదురుకోవడం, గంజాయి ఆరోపణలు రావడం…ఇలా ద్వారంపూడిపై చాలా ఆరోపణలు వచ్చాయి.
ఇవన్నీ ద్వారంపూడికి పెద్ద మైనస్. పైగా ఈయనపై టిడిపి, జనసేన శ్రేణులు బాగా కసిగా ఉన్నాయి. ఈ సారి ఎన్నికల్లో ఓడించి తీరాలని చూస్తున్నారు. తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి పర్యటనలో ఉన్న పవన్..పిఠాపురం వారాహి యాత్రలో కాకినాడకు వస్తున్నానని, ద్వారంపూడి పని పడతానని అన్నారు. ఇదే క్రమంలో కాకినాడలో పవన్ పర్యటన ఉంది. అప్పుడు పవన్..ద్వారంపూడి టార్గెట్ గా ఎలా మాట్లాడతారో అనే ఆసక్తి అందరికీ ఉంది.

ఇక వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిని ఓడించాలని పవన్ గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే జనసేన ఒకటే..ద్వారంపూడిని ఓడించడం కష్టం . టిడిపి కలిస్తేనే ద్వారంపూడిని నిలువరించవచ్చు. వాస్తవానికి 2009లో ప్రజారాజ్యం, 2019లో జనసేన ఓట్లు చీల్చడం వల్లే ద్వారంపూడి ఎమ్మెల్యేగా గెలిచారు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ద్వారంపూడికి 73 వేల ఓట్లు రాగా, టిడిపికి దాదాపు 60 వేల ఓట్లు వచ్చాయి. జనసేనకు 30 వేల ఓట్లు పడ్డాయి. అంటే టిడిపి, జనసేన కలిస్తే 90 వేల ఓట్లు..వైసీపీ కంటే 17 వేల ఓట్లు ఎక్కువ. దీని బట్టి చూస్తే టిడిపి, జనసేన కలిస్తే ద్వారంపూడి ఓటమి తప్పదు. సీటు ఎవరికి దక్కిన పొత్తు ఉంటేనే ద్వారంపూడికి చెక్ పడుతుంది.