గుడివాడలో జనసేన పోటీ చేస్తే రాజకీయం ఎలా మారుతుంది….మంత్రి కొడాలి నానికి ప్లస్ అవుతుందా? లేక టీడీపీకి ప్లస్ అవుతుందా? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. అదే సమయంలో టీడీపీ-జనసేనలు పొత్తులో పోటీ చేస్తే కొడాలి పరిస్తితి ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తిగానే ఉంటుంది. మామూలుగా గుడివాడలో ఇంతవరకు జనసేన పోటీకి దిగలేదు. అయితే టీడీపీ కంచుకోటగా ఉన్న గుడివాడని కొడాలి తన అడ్డాగా మార్చుకున్న విషయం తెలిసిందే. గత రెండు ఎన్నికల నుంచి కొడాలి గుడివాడలో గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు మంత్రిగా తిరుగులేని పొజిషన్‌లో ఉన్నారు.

ఇలా తిరుగులేని పొజిషన్‌లో ఉన్న నానికి టీడీపీ-జనసేనలు చెక్ పెట్టగలవా? అనేది ఒక్కసారి చూస్తే….ఇంతవరకు జనసేన బరిలో దిగకపోవడం నానికి ప్లస్ అనే చెప్పొచ్చు. 2014లో జనసేన పోటీ చేయలేదు. టీడీపీకి సపోర్ట్ ఇచ్చింది…కానీ పూర్తిగా స్థాయిలో పవన్ అభిమానులు అప్పుడు టీడీపీకి సపోర్ట్ చేయలేదు. దీంతో 2014లో నాని గెలిచారు.

ఇక 2019 ఎన్నికల్లో గుడివాడలో జనసేన పోటీ చేయలేదు…ఆ పార్టీ తరుపున బరిలో దిగిన అభ్యర్ధి చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. ఆయన ఎందుకు తప్పుకున్నారో జనాలకు బాగా క్లారిటీ ఉంది. ఒకవేళ జనసేన బరిలో ఉంటే ఓట్లు చీలి నానికే ఇబ్బంది అయ్యేదనే విశ్లేషణలు కూడా వచ్చాయి. ఎందుకంటే గుడివాడలో కాపు ఓటర్లు నానికే ఎక్కువ సపోర్ట్ ఇస్తారు..అలాంటప్పుడు జనసేన పోటీలో ఉంటే కాపు ఓటర్లలో చీలిక వచ్చేది నానికే ఇబ్బంది అయ్యేది.

మరి నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ టీడీపీతో కలిసినా సరే నానికి కాస్త కష్టమైపోతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ సారి రెండు పార్టీలు డైరక్ట్ పొత్తులో ఉంటాయి…అప్పుడు పవన్ అభిమానులు చాలావరకు టీడీపీ వైపు రావాల్సి ఉంటుంది. ఒకవేళ విడిగా పోటీ చేస్తే కొడాలికి ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరిగేలా ఉంది. ఏదేమైనా పవన్ వాళ్ళ కొడాలికి కాస్త రిస్క్ ఎక్కువగానే ఉంది.

Discussion about this post