గత ఎన్నికల్లో చాలా టీడీపీ కంచుకోటలని వైసీపీ బద్దలుగొట్టిన విషయం తెలిసిందే. అనూహ్యంగా టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగిరింది. అయితే అలా వైసీపీ జెండా ఎగిరిన టీడీపీ కంచుకోటల్లో ఇప్పుడు సీన్ మారుతూ వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి ప్లస్ అవుతుంది. అలాగే కొందరు టీడీపీ నేతలు దూకుడుగా పనిచేయడం కలిసొస్తుంది.

అలా టీడీపీకి కలిసొస్తున్న స్థానాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాయకరావుపేట స్థానం కూడా ఒకటి. ఇది పక్కా టీడీపీ కంచుకోట. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు ఇక్కడ టీడీపీ గెలిచింది. 2009లో కాంగ్రెస్, 2012 ఉపఎన్నికలో వైసీపీ గెలిచింది. మళ్ళీ 2014లో టీడీపీ గెలిచింది. 2019లో వైసీపీ నుంచి గొల్ల బాబూరావు గెలిచారు. గెలిచిన తక్కువ సమయంలోనే వ్యతిరేకత తెచ్చుకున్న ఎమ్మెల్యేల్లో గొల్ల ముందున్నారు. ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే..సొంత పార్టీ వాళ్లే గొల్లని వ్యతిరేకించే పరిస్తితి. ఇప్పటికే ఆయనపై వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ సీటు ఇస్తే తామే ఓడిస్తామని వైసీపీ నేతలు మాట్లాడే పరిస్తితి. వైసీపీ అంతర్గత సర్వేలో కూడా ఎమ్మెల్యే పనితీరు పట్ల పాజిటివ్ లేదని తెలుస్తోంది. అటు టీడీపీ నుంచి వంగలపూడి అనిత దూకుడుగా పనిచేస్తున్నారు. 2014లో గెలిచిన అనిత..2019లో కొవ్వూరులో పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ పాయకరావుపేటకు వచ్చి పనిచేస్తున్నారు.

ఇక్కడ మళ్ళీ టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ముందుకెళుతున్నారు. అయితే ఇక్కడ టీడీపీకి అంతా బాగానే ఉంది.కానీ ఒక చిక్కు ఉంది. ఇక్కడ జనసేనకు ఓటు బ్యాంకు ఉంది. నెక్స్ట్ పొత్తు ఉంటే టీడీపీ ఈజీగా గెలుస్తుంది..లేదంటే కాస్త రిస్క్ ఉంటుంది. దాదాపు పొత్తు ఖాయమయ్యేలా ఉంది కాబట్టి పాయకరావు పేట టీడీపే ఖాతాలో పడే ఛాన్స్ ఉంది.

Leave feedback about this