Site icon Neti Telugu

పాయకరావుపేటలో వైసీపీకి డ్యామేజ్..అనితకు కలిసొచ్చినట్లే..!

ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోటల్లో పాయకరావుపేట కూడా ఒకటి. ఇక్కడ మంచి విజయాలు సాధించింది. 1983 నుంచి అక్కడ టి‌డి‌పి హవా నడుస్తోంది. మధ్యలో 2009 ఎన్నికల్లో ఓడిపోగా, 2014లో మళ్ళీ టి‌డి‌పి గెలిచింది. అంటే వరుసగా పాయకరావుపేటలో టి‌డి‌పి హవా నడిచింది. కానీ గత ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడింది. అక్కడ వైసీపీ నుంచి గొల్ల బాబూరావు గెలిచారు.  

అయితే వైసీపీ నుంచి గెలిచిన గొల్లపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తక్కువ సమయంలోనే ఆయన ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే..ఆయన్ని సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకిస్తున్నారు. ఈ సారి గాని సీటు ఇస్తే తామే ఓడిస్తామని కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. అంటే అక్కడ ఎమ్మెల్యే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మళ్ళీ ఆయనకు గెలుపు అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇదే సమయంలో టి‌డి‌పి నాయకురాలు అనితకు మంచి ఛాన్స్ దక్కిందనే చెప్పాలి.

ఈ సారి ఎన్నికల్లో ఆమెకు గెలుపు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ ఇంకా ఆమె కష్టపడాలి. కార్యకర్తలని పూర్తి స్థాయిలో కలుపుని వెళ్ళాలి. 2019 ఎన్నికల్లో వేరే నియోజకవర్గానికి వెళ్ళడం వల్ల అనితకు పాయకరావుపేటతో కాస్త గ్యాప్ వచ్చింది. అలాగే అక్కడ టి‌డి‌పిలో ఆమెని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఆ పోరు వాళ్లే 2019లో అనిత కొవ్వూరు వెళ్ళి పోటీ చేశారు. అక్కడ ఓడిపోయి మళ్ళీ పాయకరావుపేటకు వచ్చేశారు.

ఇప్పుడు ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు. ఇంకాస్త దూకుడుగా పనిచేస్తే ఈ సారి పాయకరావుపేటలో టి‌డి‌పి జెండా ఎగిరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

Exit mobile version