తెలుగుదేశం పార్టీలో కరెక్ట్‌గా సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతూ ప్రత్యర్ధుల నోరు మూయించగల సమర్ధత ఉన్న నేతల్లో పయ్యావుల కేశవ్ ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. ఈయన ఎప్పుడు ప్రత్యర్ధులపై నోరు వేసుకుని పడిపోరు..కేవలం తన సబ్జెక్ట్‌తో ప్రత్యర్ధులకు చెక్ పెట్టేస్తారు. అసలు తనదైన శైలిలో ప్రత్యర్ధుల తప్పులని ఎత్తిచూపుతూ వారికి చుక్కలు చూపిస్తారు. అందుకే ప్రత్యర్ధులు సైతం మెచ్చుకునే నేతగా పయ్యావులకు పేరుంది.

ఇలా ప్రత్యర్ధులని సైతం మెప్పించగల సామర్థ్యం ఉన్న పయ్యావులకు…తన రాజకీయ జీవితంలో మంచి లక్కీ ఛాన్స్ మాత్రం దొరకలేదని చెప్పొచ్చు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న పయ్యావులకు మంత్రి అయ్యే అవకాశం రాలేదు. ఎందుకంటే ఈయన గెలిచినప్పుడల్లా టీడీపీ అధికారంలోకి రాలేదు. పయ్యావుల మొదటిసారి గెలిచిన 1994లో మాత్రం టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు జూనియర్ ఎమ్మెల్యే కాబట్టి పదవి రాలేదు.

మళ్ళీ 1999లో ఓడిపోగా, 2004, 2009 ఎన్నికల్లో గేలిచారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014లో టీడీపీ అధికారంలోకి వస్తే…పయ్యావుల ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే..టీడీపీ అధికారంలోకి రాలేదు. ఇలా పయ్యావులని దురదృష్టం వెంటాడుతూనే ఉంది. అయితే ఈ సారి పయ్యావులకు లక్కీ ఛాన్స్ దొరికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు టీడీపీ అనుకూల పవనాలు వీయడం మొదలయ్యాయి. రెండున్నర ఏళ్లలోనే పార్టీ చాలావరకు పికప్ అయింది. ఇంకా రెండున్నర ఏళ్ళు కూడా కష్టపడితే పార్టీ గెలవడానికి మంచి అవకాశాలు దొరికినట్లే అని చెప్పొచ్చు. ఇక టీడీపీ అధికారంలోకి వస్తే పయ్యావుల ఎమ్మెల్యేగా గెలిస్తే…ఈ సారి మంత్రి పదవి మాత్రం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

అయితే ఉరవకొండలో పయ్యావులకు గెలిచే అవకాశాలు ఉన్నాయా ? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో ఉరవకొండలో పయ్యావులకు అనుకూలంగానే రాజకీయం ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా ఈ సారి గెలిస్తే మంత్రి అవుతారనే అవగాహన అక్కడి ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ సారి పయ్యావులకు లక్కీ ఛాన్స్ ఉంటుందనే చెప్పొచ్చు.

Discussion about this post