రాజధాని అమరావతి పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఈ సారి టిడిపి సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఆ పరిధిలో సీట్లలో టిడిపి దారుణంగా ఓడిపోయింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి అమరావతిని ఏ రకంగా నాశనం చేస్తుందో తెలిసిందే. దీంతో ఆ ప్రాంత ప్రజలు వైసీపీపై వ్యతిరేకంగా, టిడిపికి అనుకూలంగా ఉన్నారు. ఈ క్రమంలోనే అమరావతి పక్కనే ఉన్న పెదకూరపాడు నియోజకవర్గంలో అదే పరిస్తితి ఉంది.

ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావుకు పెద్దగా అనుకూలత లేదు. ఇదే సమయంలో టిడిపి నేత కొమ్మాలపాటి శ్రీధర్ పుంజుకున్నారు. ఈ తరుణంలోనే చంద్రబాబు పెదకూరపాడులో ఎంట్రీ ఇచ్చారు. ఇక అక్కడ బాబు పర్యటనకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. సభకు భారీగా జనం వచ్చారు. దీని బట్టి చూసుకుంటే పెదకూరపాడులో టిడిపి లీడ్ లోకి వచ్చిందని అర్ధమవుతుంది. అదే సమయంలో పెదకూరపాడులో టిడిపికి ఆధిక్యం రావడం, అలాగే అభ్యర్ధిగా శ్రీధర్‌ని దాదాపు ఫిక్స్ చేసేశారని చెప్పాలి. ఎందుకంటే పార్టీ బలం పెరిగేలా ఆయన కష్టపడుతున్నారు.
అసలు 1983, 1985లో అక్కడ టిడిపి గెలిచింది..ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లో అక్కడ టిడిపి గెలిచేలా శ్రీధర్ చేశారు. అయితే 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గెలిచారు. అంటే ఇక్కడ ఆయనకు ఎంత పట్టు ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఆయన టిడిపిలోకి వచ్చారు. అయితే కన్నాకు గుంటూరు వెస్ట్ గాని, సత్తెనపల్లి సీటు గాని ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే పెదకూరపాడులో పట్టు ఉండటం వల్ల శ్రీధర్‌కు మద్ధతుగా నిలబడితే..ఆయన సులువుగా గెలిచేస్తారు. మొత్తానికి పెదకూరపాడులో శ్రీధర్ గెలుపు ఖాయమనే చేపవచ్చు.