ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లో పెద్దాపురం కూడా ఒకటి. పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పెద్దాపురంలో టిడిపి హవా నడుస్తోంది. 1983, 1985 ఎన్నికల్లో టిడిపి గెలవగా, 1989లో కాంగ్రెస్ గెలిచింది. 1994, 1999 ఎన్నికల్లో మళ్ళీ టిడిపి గెలిచింది. 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో మళ్ళీ టిడిపి గెలిచింది. అంటే మొత్తం ఆరు సార్లు పెద్దాపురంలో టిడిపి గెలిచింది.

ఇక వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని టిడిపి చూస్తుంది. కానీ ఇంతవరకు ఇక్కడ వైసీపీ గెలవలేదు. అందుకే ఎలాగైనా ఇక్కడ వైసీపీ జెండా ఎగరాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు పెద్దాపురంలో ఉన్న రాజకీయ పరిస్తితులని చూస్తే..టీడీపీకే అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మొన్నటివరకు అభ్యర్ధి విషయంలో కాస్త క్లారిటీ లేదు గాని..తాజాగా జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు..పెద్దాపురంలో మళ్ళీ చినరాజప్ప పోటీ చేస్తారని తేల్చి చెప్పేశారు. గత రెండు ఎన్నికల్లో ఆయనే పెద్దాపురం నుంచి గెలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

కానీ ఈ సారి ఎన్నికల్లో పెద్దాపురం సీటు కమ్మ వర్గానికి ఇవ్వాలని డిమాండ్ వచ్చింది. అయితే బాబు మళ్ళీ రాజప్పకే సీటు అని చెప్పేశారు. దీంతో పెద్దాపురం బరిలో రాజప్ప పోటీ చేయడం ఖాయమైంది. అటు వైసీపీ నుంచి దవులూరి దొరబాబు పోటీ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఆయనకు గెలుపు అవకాశాలు తక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది.

పైగా నెక్స్ట్ టీడీపీ-జనసేన పొత్తు గాని ఫిక్స్ అయితే సీన్ మారిపోతుంది..పూర్తిగా టీడీపీ హవా నడవడం ఖాయమవుతుంది. పొత్తు ఉంటే వైసీపీ గెలుపు గగనమనే చెప్పాలి..అందులో ఏ మాత్రం డౌట్ లేదనే చెప్పాలి.
