Site icon Neti Telugu

పెద్దిరెడ్డికే సొంత నేతల షాక్..తేల్చలేకపోతున్నారా?

పైకి టీడీపీ పని అయిపోయిందని, ఆఖరికి చంద్రబాబు కుప్పంలో కూడా గెలవరని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు గాని…లోలోపల మాత్రం నెక్స్ట్ తాము గెలిచి అధికారంలోకి వస్తామా? లేదా? అనే డౌటే వైసీపీ నేతల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు జగన్..ఎమ్మెల్యేలకు క్లాస్ పీకడం, పనిచేయని వాళ్ళకు సీట్లు లేదని వార్నింగ్‌లు ఇవ్వడం చేస్తున్నారు. అటు అగ్రనేతలు జిల్లాలకు వెళుతూ..అక్కడ వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరుని చల్లార్చేందుకు చూస్తున్నారు.

ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశమై..పార్టీలో పరిస్తితులని చక్కదిద్దుతున్నారు. ఆ కార్యక్రమం చేస్తూ కూడా చంద్రబాబుపై పెద్దిరెడ్డి  విమర్శలు చేస్తున్నారు. ఆ మధ్య కళ్యాణదుర్గంలో మాట్లాడుతూ..చంద్రబాబు కుప్పంలో ఓడిపోబోతున్నారని, ఆయన కళ్యాణదుర్గంలో పోటీ చేసే ఛాన్స్ ఉందని, ఎక్కడ పోటీ చేసిన ఓడిస్తామని చెప్పారు.

అయితే అక్కడ ఉన్న పరిస్తితులని చక్కదిద్దకుండా బాబుపై విమర్శలు చేశారు. వాస్తవానికి కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీకు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. అటు ఉరవకొండ సమావేశంలో ఏం జరిగిందో చెప్పాల్సిన పని లేదు. పెద్దిరెడ్డి ముందే మాజీ విశ్వేశ్వర్ రెడ్డిపై..ఆయన సొంత తమ్ముడు మధుసూదన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విశ్వేశ్వర్‌కు మళ్ళీ సీటు ఇస్తే సొంత పార్టీ వాళ్ళే ఓడిస్తారని అన్నారు.

అటు హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్‌పై సొంత పార్టీ వాళ్లే రగులుతున్నారు. అలాగే మడకశిరలో ఎమ్మెల్యే తిప్పేస్వామి బాగా డబ్బు మనిషి అయ్యాడని, ప్రతి పనికి డబ్బు తీసుకుంటున్నారని సొంత పార్టీ వాళ్ళే మాట్లాడుకునే పరిస్తితి. ఇలా జిల్లాలో వైసీపీలో రచ్చ నడుస్తోంది. దీంతో పార్టీ పరిస్తితిని సరిచేద్దామని వెళ్ళిన పెద్దిరెడ్డికే షాక్ తగులుతుంది. మొత్తానికి జిల్లాలో వైసీపీలో పోరు తగ్గేలా లేదు.  

Exit mobile version