మూడేళ్లలోనే వైసీపీ ప్రభుత్వం ఎదురీతుందనే చెప్పొచ్చు…ఎక్కడైనా అధికార పార్టీ మీద ప్రజా వ్యతిరేకత వస్తుంది..కానీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి రెండున్నర ఏళ్ల నుంచే ఊహించని విధంగా వ్యతిరేకత మొదలైంది….వైసీపీ ప్రజా ప్రతినిధులపై ప్రజలే తిరుగుబాటు చేసే స్థాయికి వచ్చింది. అసలు గడప గడపకు వెళుతున్న ఎమ్మెల్యేలని ప్రజలు ఎలా నిలదీస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. అంటే వైసీపీపై ఏ స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే మంత్రులపై కూడా వ్యతిరేకత ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. మెజారిటీ మంత్రులపై వ్యతిరేకత కనిపిస్తోంది.

అయితే పవర్ ఫుల్ మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం ఈ సారి ఎదురీత తప్పేలా లేదు. అసలు పెద్దిరెడ్డికి రాజకీయంగా తిరుగులేదనే చెప్పొచ్చు. చిత్తూరు జిల్లాలో ఈయనదే ఆధిపత్యం. పేరుకు చిత్తూరు..చంద్రబాబు సొంత జిల్లా గాని…అక్కడ ఆధిపత్యం మాత్రం పెద్దిరెడ్డిదే. ఇక ఆయన చేసే రాజకీయం వల్లే చిత్తూరులో వైసీపీ హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే చిత్తూరులో టీడీపీ బలపడాలంటే ముందు పెద్దిరెడ్డిని నిలువరించాలి..చంద్రబాబు ఇప్పుడు అదే పనిలో ఉన్నారని చెప్పొచ్చు.ఇప్పటికే పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో…టీడీపీ తరుపున బలమైన నాయకుడుని పెట్టారు. చల్లా రామచంద్రారెడ్డిని ఇంచార్జ్ గా పెట్టారు…ఇంచార్జ్ గా పెట్టిన దగ్గర నుంచి చల్లా దూకుడుగా రాజకీయం చేస్తూ…పుంగనూరులో టీడీపీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. పైగా పెద్దిరెడ్డిపై వ్యతిరేకత కూడా పెరుగుతుంది. ఈ పరిస్తితిని బట్టి చూస్తే ఈ సారి పుంగనూరులో పెద్దిరెడ్డి విజయం అంత సులువు కాదనే చెప్పాలి.

ఇక డోన్ లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హవా ఉన్న విషయం తెలిసిందే…అక్కడ కూడా టీడీపీ ఇంచార్జ్ ని మార్చారు…సుబ్బారెడ్డి ఇంచార్జ్ గా వచ్చిన దగ్గర నుంచి డోన్ లో సీన్ మారింది…టీడీపీకి అనుకూలమైన పరిస్తితులు వస్తున్నాయి. సుబ్బారెడ్డి ఇంకాస్త కష్టపడితే ఈ సారి డోన్ లో బుగ్గనని నిలువరించవచ్చు.
Discussion about this post