ఉమ్మడి గుంటూరు జిల్లాలో కమ్మ వర్గం హవా ఎక్కువ ఉన్న స్థానాల్లో పెదకూరపాడు కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ కాపు, బీసీ, ఎస్సీ వర్గాలు ఉన్నాయి గాని..రాజకీయాలని కమ్మ వర్గం ఎక్కువ ప్రభావితం చేయగలదు. అటు కాపు వర్గం ప్రభావం ఉంటుంది. అయితే కమ్మ వర్గం హవా ఉన్నా సరే ఇక్కడ టిడిపి ఎక్కువసార్లు గెలవలేదు. 1983, 1985 ఎన్నికల్లో, 2009, 2014 ఎన్నికల్లోనే టిడిపి గెలిచింది. టిడిపి హవా ఉన్న 1994, 1999 ఎన్నికల్లో కూడా ఇక్కడ టిడిపి గెలవలేదు. ఇక్కడ కాంగ్రెస్ హవా ఎక్కువ నడిచింది.
అది కూడా కన్నా లక్ష్మీనారాయణ సత్తా చాటారు. నాలుగుసార్లు ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇక ఇప్పుడు ఆయన టిడిపిలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పెదకూరపాడులో టిడిపికి అడ్వాంటేజ్ అవుతుంది. కాపు వర్గం కాస్త కలిసొస్తుంది. ఇక జనసేనతో పొత్తు ఉంటే కాపు ఓట్లు ఇంకా కలుస్తాయి. అప్పుడు టిడిపి నేత కొమ్మాలపాటి శ్రీధర్ కు ప్లస్ అవుతుంది.

2009, 2014 ఎన్నికల్లో గెలిచిన శ్రీధర్..2019 ఎన్నికల్లో ఓడిపోయారు. శ్రీధర్ కమ్మ వర్గం నేత కాగా, వైసీపీ నుంచి కూడా కమ్మ వర్గం నుంచి నంబూరు శంకర్ రావు పోటీ చేసి గెలిచారు. దీంతో కమ్మ ఓట్లు చీలిపోయాయి. అటు జనసేన వల్ల కాపు ఓట్లు కూడా చీలాయి. దీంతో వైసీపీ గెలిచింది.
అయితే ప్రస్తుతం అక్కడ శ్రీధర్, శంకర్ ల మధ్య టఫ్ ఫైట్ ఉంది. మొన్నటివరకు శంకర్‌ది పై చేయి అన్నట్లు కనిపించింది..కానీ కన్నా టిడిపిలోకి రావడం వల్ల శ్రీధర్‌కు ప్లస్ అవుతుంది. ఇంకా జనసేన పొత్తు కూడా ఉంటే డౌట్ లేకుండా శ్రీధర్‌దే పైచేయి అని చెప్పవచ్చు.