పీడిక రాజన్న దొర…అధికార వైసీపీలో పెద్దగా వివాదాలు లేని సీనియర్ ఎమ్మెల్యే. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా సరే పెత్తనాలు చేయడం..అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు. అయితే సాలూరు నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న రాజన్నకు…నాల్గవసారి గెలిచే అవకాశం ఉందా? అంటే మొన్నటివరకు ఉన్నట్లే కనిపించినా…కొంతకాలం నుంచి రాజకీయం మారినట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా సరే…సాలూరులో అనుకున్న మేర అభివృద్ధి పనులు చేయించడంలో రాజన్న వెనుకబడ్డారు. పైగా విజయనగరంలో మంత్రి బొత్స హవా ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇక ఆయన పరోక్షంగా రాజన్నకు ఛాన్స్ ఇవ్వట్లేదని తెలుస్తోంది. ఎలాగో రాజన్నకు రావాల్సిన మంత్రి పదవి…పుష్పశ్రీకి వచ్చేలా చేశారనే విమర్శలు ఉన్నాయి. పైగా సాలూరుకు నిధులు కేటాయించే విషయంలో కూడా కాస్త అన్యాయమే జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలు రాజన్నకు బాగా మైనస్ అవుతున్నాయి. ఆ మధ్య వచ్చిన కొన్ని సర్వేల్లో ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల లిస్ట్‌లో రాజన్న కూడా ఉండటం విశ్లేషకులని ఆశ్చర్యపరిచింది. అయితే వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే అవ్వడంతో…సహజంగానే వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తోంది. పైగా బొత్స మేనల్లుడు చిన్న శ్రీను సాలూరులో పెత్తనం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ అంశం రాజన్నకు బాగా ఇబ్బంది అవుతున్నట్లు సమాచారం. వైసీపీలో ఇలా ఉంటే…టీడీపీలో ఈ మధ్యే మార్పులు జరిగాయి. సరిగ్గా పనిచేయని మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రతాప్‌ని చంద్రబాబు పక్కన పెట్టేశారు.

అలాగే సీనియర్ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణిని ఇంచార్జ్‌గా పెట్టారు. ఇంచార్జ్‌గా వచ్చాక సంధ్యారాణి సాలూరులో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ సాలూరులో టీడీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే ఈ సారి రాజన్న గెలుపు అంత సులువు అయ్యేలా లేదు. ఒకవేళ ఆయనకు ఏమన్నా మంత్రి పదవి వచ్చి..నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తే..అప్పుడు ఏమన్నా పరిస్తితి మారే ఛాన్స్ ఉంది..లేదంటే రాజన్నకు ఈసారి కష్టమే.
Discussion about this post