ఇటీవల వైసీపీ ప్రభుత్వానికి ప్రతిదీ నెగిటివ్ అవుతుంది..ఈ మధ్య ఏదైనా సరే వైసీపీకి ఇబ్బంది కలిగే అంశమే హైలైట్ అవుతుంది…కల్తీ సారా ఘటన కావొచ్చు, వివేకా హత్యకేసు కావొచ్చు, రాజధాని అంశం కావొచ్చు, అప్పులు కావొచ్చు, జిల్లాల విభజన కావొచ్చు…ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే జరుగుతుంది..ఈ అంశాలని పట్టుకుని ప్రతిపక్ష టీడీపీ, వైసీపీపై విరుచుకుపడుతుంది. అయితే టీడీపీకి కౌంటర్లు ఇవ్వడానికి వైసీపీ చూస్తుంది గాని..ప్రజలకు విషయం అర్ధమైపోవడంతో వైసీపీ ఎంత కవర్ చేసుకున్న ఉపయోగం ఉండటం లేదు.

అసలు చెప్పాలంటే టీడీపీని డిఫెండ్ చేసే అంశం వైసీపీకి దొరకడం లేదు. ఇలాంటి పరిస్తితుల్లో ఉన్న నేపథ్యంలో టీడీపీని ఇరుకున పెట్టడానికి వైసీపీకి ఒక అంశం దొరికింది. ఫోన్లను దొంగచాటుగా వినే పెగాసస్ సాఫ్ట్‌వేర్ అంశంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన తాజా కామెంట్లని వైసీపీ పట్టుకుంది. ఇప్పటికే దీని గురించి జాతీయ స్థాయిలో రచ్చ నడుస్తోంది. ఇలా అత్యంత వివాదాస్పదమైన సాఫ్ట్‌వేర్‌ని గత చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందని మమతా తాజాగా వ్యాఖ్యానించారు.

అయితే మమతా వ్యాఖ్యలపై వెంటనే టీడీపీ వివరణ ఇచ్చింది…సాఫ్ట్‌వేర్ అమ్మడానికి చూశారు గాని అది తాము కొనలేదని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. అలాగే కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గతేడాది సమాచార హక్కు చట్టం కింద పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారా? అని చెప్పి రాష్ట్ర డీజీపీని కోరారు. ఈ క్రమంలోనే డీజీపీ కార్యాలయం ఈ సాఫ్ట్‌వేర్‌ను తమ శాఖ ఎప్పుడూ కొనుగోలు చేయలేదని సమాధానం ఇచ్చింది. అంటే పెగాసస్‌ని గత చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది.

అయినా సరే వైసీపీ నేతలు దీనిపై రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. అసలు అధికారంలోకి వచ్చాక చిన్న విషయాన్ని కూడా వదలకుండా టీడీపీకి చుక్కలు చూపిస్తున్న వైసీపీ…పెగాసస్ కొని ఉంటే ఈ పాటికే టీడీపీని ఆడేసుకునేది…కాబట్టి ఇప్పుడు వైసీపీ చేసేది హడావిడి అని అర్ధమైపోతుంది…ఈ విషయంలో కూడా టీడీపీని వైసీపీ ఇరుకున పెట్టలేదు.

Discussion about this post