రాష్ట్ర రాజకీయాలలో రాయలసీమ రాజకీయాలది ప్రత్యేక స్థానం… అధికారం మారినప్పుడల్లా ఒక వర్గం నాయకులు ఐదేళ్లు మౌనంగా వుండాల్సిందే… ఎందుకంటే దశాబ్దాలుగా అక్కడ సాగుతున్న ఆధిపత్య పోరు అలాంటిది… అలాంటి రాయలసీమలో ఒక మహిళ ప్రజలకు నేనున్నాంటూ ముందుకు వచ్చింది. ఆవిడే సవితమ్మ

ప్రస్తుత వైసిపి ప్రభుత్వ పాలనలో మహామహులే మనకెందుకులే,ఇప్పుడెందుకు రాజకీయాలు అనుకుని వుంటున్న తరుణంలో అధికార పార్టీ వ్యాపారాలపై కన్నువేసిన ,ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్న ఏమాత్రం అదరక ,బెదరక ప్రజలకోసం అడుగే ముందుకే వేస్తుంది తప్పా వెనుకడుగు మాత్రం వేయలేదు… కరోనా సమయంలో ఐరన్ లేడిగా గుర్తింపు పొందిన సీతక్క సేవలు చాలామందికి తెలుసు.అదే సమయంలో పెనుకొండ నియోజకవర్గంలో సవితమ్మ సేవలు అందించింది…

తెలుగుదేశం పార్టీ చెప్పిన సమాజమే దేవాలయం ప్రజలేదేవుళ్ళు అనే నినాదమే స్పూర్తిగా నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాంటూ అండగా నిలబడటమే కాకుండా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా వెరవకుండా పోరాడి తన గ్రామంలో ఎంపిటిసి గెలిపించుకుంది… అలాగే పంచాయతీ మరియు మిగిలిన ఎన్నికలకు తనవంతు సహకారాన్ని అందించింది… ఇప్పుడు రాయలసీమ వరదల నేపథ్యంలో నిరాశ్రయులైన కడప జిల్లా రాజంపేట మండలంలో 500కుటుంభాలకు 11రకాల నిత్యావసర సరుకులు అందజేయడానికి సిద్ధం చేసారు… ఇంతకుముందు కూడా తనతండ్రి మాజీమంత్రి కీర్తిశేషులు యస్ రామచంద్రారెడ్డి ట్రస్ట్ పేరుమీద అనేక సేవా కార్యక్రమాలు చేసింది…

ఇదంతా ఎందుకంటే తను చెప్పే మాట ఒకటే… తెలుగుదేశం పార్టీ నేర్పిన సేవాధృక్పతం మరియు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు కష్టాల్లో వున్నప్పుడు మనవంతు బాద్యతగా సేవలు అందించాలి అనే చెప్పిన మాటలే అంటుంది… ఇటు రాజకీయంగా, సామాజికంగా ఉత్సాహంగా వుండే కొత్త తరం యువతను పార్టీ ప్రొత్సాహిస్తే తెలుగుదేశం పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని అంటున్నారు… అంతేకాకుండా సవితమ్మకు రాజకీయ కుటుంబ నేపథ్యం వుండటం ,అనంతపురంలో ప్రధానమైన కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈమెకు అవకాశం ఇస్తే జిల్లాలో కూడా ఆ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టికి బలమైన ఓటుబ్యాంకు అవుతుందని విశ్లేషకులు అంటున్నారు…

Discussion about this post