ఏపీకి జగన్ శాశ్వత సీఎంగా ఉంటారు..మరో 30 ఏళ్ల పాటు సిఎంగా ఉంటారు..అంటే జగన్‌కు వయసు పై బడే వరకు ఏపీకి సిఎంగా ఉంటారట. వైసీపీ అధికారంలో ఉంటుందట. ఈ మాటలు వైసీపీ నేతలే కాదు..జగన్ కూడా చెప్పుకుంటున్నారు. తాను రాష్ట్రానికి 30 ఏళ్ల పాటు సిఎంగా ఉంటానని అంటున్నారు. అయితే ఆశలు పెట్టుకోవడంలో తప్పు లేదు..కానీ వాటికి ఓ హద్దు ఉండాలి.
సరే 30 ఏళ్ల సిఎం ఆశ అనేది తప్పు కాదని అనుకుందాం..మరి ఆశ నెరవేరుతుందా? అంటే అదంతా ప్రజల చేతుల్లోనే ఉంటుందని చెప్పాలి. అయితే ఏ చైనా మాదిరిగా మన దేశంలో శాశ్వతంగా ఎవరు అధికారంలో ఉండరు. ప్రజలకు పాలన నచ్చితే మరో అవకాశం ఇస్తారు..అంతే తప్ప శాశ్వతంగా అధికారంలో కూర్చోబెట్టారు. కానీ జగన్ మాత్రం శాశ్వత సిఎంగా ఉంటారని అంటున్నారు. మరి ఆ అవకాశం ఏపీ ప్రజలు ఇస్తారా? అంటే ముందు వచ్చే ఎన్నికల్లోనే ఆ అవకాశం ఇచ్చేలా లేరు. ఒకవేళ జగన్ పాలన బాగుంటే మరొకసారి గెలిపిస్తారు. మరి పాలన బాగుందా? అంటే అది ప్రజలకే తెలియాలి. సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కానీ ఆదాయం సృష్టించి డబ్బులు ఇవ్వట్లేదు..అప్పులుచేయడం, ప్రజలపై పన్నుల భారం పెంచడం చేయరు.
జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలపై ఆర్ధిక భారం పెరిగింది..అప్పులు పెరిగాయి. అన్నీ ధరలు పెరిగిపోయాయి. అటు రాజకీయాన్ని రాజకీయంగా చేయడం లేదు..ప్రత్యర్ధులపై కక్ష సాధింపులు జరుగుతున్నాయి. ప్రశ్నించిన వారిపై కేసులు, దాడులు పెరిగాయి. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. అలా కాకుండా తాము పథకాలకు డబ్బులు ఇస్తున్నామని, దాంతో ప్రజలంతా తమవైపే ఉంటారని, శాశ్వతంగా జగన్‌ని సిఎంగా చేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ ఆ అవకాశం ప్రజలు ఇచ్చే ఛాన్స్ లేదు. ముందు ఇంకొక అవకాశం ఇస్తారో లేదో చూడాలి. వచ్చే ఎన్నికల్లోనే జగన్ శాశ్వత సిఎంగా ఉంటారో లేదో తేల్చేస్తారు.