ఏపీ మంత్రుల్లో పేర్ని నాని కాస్త వెటకారంగా మాట్లాడే మంత్రి అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యర్ధులపై తనదైన శైలిలో పంచ్‌లు వేస్తుంటారు. అయితే పేర్ని వేసే పంచ్‌ల్లో కాస్త లాజిక్ కూడా ఉంటుంది. అందుకే పేర్ని విమర్శలకు కాస్త అర్ధం ఉన్నట్లు ఉంటుంది. కానీ తాజాగా సినిమాలకు సంబంధించిన విషయంలో పేర్ని పూర్తిగా లాజిక్ లేకుండా మాట్లాడినట్లు కనిపిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్లని తగ్గించిన విషయం తెలిసిందే. ఇక దీనిపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు గగ్గోలు పెట్టేస్తున్నారు.

ఆ రేట్లతో తాము భారీగా నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వారు, మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాని సినిమా టిక్కెట్ల సంబంధించి కొన్ని కామెంట్లు చేసి…తాము అందరూ హీరోలని ఒకేలా చూస్తామని, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదని, గత ప్రభుత్వం మాదిరిగా బామ్మర్ది చరిత్రాత్మక సినిమా తీస్తే ట్యాక్స్ తీసి..చిరంజీవి తీసిన చరిత్రాత్మక సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వలేదని నాని మాట్లాడారు.

అయితే ఇక్కడే పేర్ని పూర్తిగా లాజిక్ మిస్ అయిపోయారు. అవును బాలయ్య తీసిన సినిమా గౌతమీపుత్రశాతకర్ణి సినిమాకు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది..అలాగే మహానటి లాంటి చిత్రాలకు కూడా ఇచ్చింది..అదేవిధంగా పెద్ద హీరోల సినిమాలకు అదనపు షోలు, టిక్కెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కూడా ఇచ్చింది. దాని వల్ల సినిమా ఇండస్ట్రీకి లాభం జరిగింది.


కానీ చిరంజీవి చేసిన సైరా నరసింహారెడ్డి రిలీజ్ అయింది…జగన్ అధికారంలోకి వచ్చాక 2019, అక్టోబర్ 2న సినిమా వచ్చింది. జగన్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వకుండా, ఇదేదో చంద్రబాబు ఉన్నప్పుడు రిలీజ్ అయింది..అప్పుడు బాలయ్య సినిమాకి ఇచ్చి, చిరంజీవి సినిమాకు ఇవ్వలేదని పేర్ని చెప్పడం కాస్త విడ్డూరంగా ఉంది. మంత్రి గారు క్లారిటీగా అన్నీ విషయాలు తెలుసుకునే మాట్లాడితే బెటర్ అని తెలుగు తమ్ముళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు.

Discussion about this post