సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సమస్యలు సృష్టించింది ఎవరో? మళ్ళీ ఆ సమస్యలని పరిష్కరిస్తామని చెప్పి, హీరోలని, డైరక్ట్‌లని తమ వద్దకు ఎలా రప్పించుకున్నారో? ప్రతి విషయం జనాలకు తెలుసు, అలాగే సినీ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా తెలుసు…ఇందులో ఎలాంటి డౌట్ లేదు…సమస్య సృష్టించింది జగన్ ప్రభుత్వం..ఆ సమస్యని పరిష్కరిస్తున్నట్లు నటిస్తుంది జగన్ ప్రభుత్వం. ఎందుకంటే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గాని, అంతకముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గాని సినీ ఇండస్ట్రీకి సంబంధించి సమస్యలు రాలేదు.

పైగా సినీ పెద్దలు ఏది అడిగితే అది చేసేవారు…వారు తమ దగ్గరకు రాకుండానే పనులు చేసేపెట్టేవారు. ఒక్క మాట చెబితే చాలు చంద్రబాబు, సినిమా వాళ్ళ కోసం ఏదైనా చేసేవారు. అప్పుడు ఇలాంటి సమస్యలు ఏమి రాలేదు…కానీ సినిమా వాళ్ళని తన దగ్గరకు రప్పించుకోవాలనే ఇగోతో జగన్ ప్రభుత్వం 1990ల కాలంలో ఉన్న సినిమా టిక్కెట్ల రేట్లని పెట్టారు. అదేం అంటే ప్రజలపై భారం పడకుండా అన్నారు..అసలు జగన్ ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రజలపై భారం ఎలా పెంచిందో అందరికీ తెలుసు. అవేమీ తగ్గించకుండా నచ్చితే చూసే సినిమా టిక్కెట్ల రేట్లని ప్రభుత్వం తగ్గించింది.

ఇక సినిమా టిక్కెట్ల రేట్లతో…తమ సినిమాలకు భారీగా నష్టం వస్తుందని హీరోలు, డైరక్టర్‌లు కంగారు పడి, వరుసపెట్టి జగన్‌ని కలవడానికి వచ్చారు. ఆఖరికి రాజకీయాల వైపు చూడని మహేష్, ప్రభాస్‌లని సైతం రప్పించారు. ఇక వీరితో జగన్ ఏదో మాట్లాడి సమస్యని పరిష్కరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు..అలాగే హీరోలు కూడా థాంక్స్ చెప్పారు. అయితే హీరోలు జగన్‌ని కలిస్తే చంద్రబాబు ఓర్వలేక ఏడుస్తున్నారని మంత్రి పేర్ని నాని అంటున్నారని, అసలు ఓర్వలేక టిక్కెట్ల రేట్ల సమస్య సృష్టించిందో ఎవరో జనాలకు తెలుసు, సినిమా వాళ్ళకు తెలుసని తెలుగు తమ్ముళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు.

అసలు సమస్య సృష్టించిందే జగన్ ప్రభుత్వమని హీరోలకు క్లారిటీ ఉంది..అలాగే వాళ్ళ ఫ్యాన్స్‌కు క్లారిటీ ఉందని, ఇప్పుడు ఏదో కలిసి థాంక్స్ చెప్పారని, జగన్‌కు వచ్చే బెనిఫిట్ లేదని అంటున్నారు. కాబట్టి జగన్ ప్రభుత్వం డ్రామాలు అందరికీ తెలుసని, పేర్ని ఎంత కవర్ చేసుకున్న ఉపయోగం లేదని కౌంటర్లు ఇస్తున్నారు.

Discussion about this post