అబ్బో ఇటీవల సినిమా టికెట్ల అంశంలో పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో ముడిపడి ఉంది. కానీ తెలంగాణలోనే ప్రధానంగా సినీ పరిశ్రమ ఉంది. అయితే తెలంగాణనే సినిమా టిక్కెట్ల నియంత్రణ విషయంలో జోక్యం చేసుకోలేదు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రజలపై భారం పడకూడదని చెప్పి, తామే సినిమా టిక్కెట్లు అమ్మాలని ఫిక్స్ అయింది. అయితే ఇది మంచి విషయమే….సినిమా టిక్కెట్లు విపరీతంగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి.

అంటే సినిమా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు టిక్కెట్ల ధరలు పెంచేస్తున్నారని చెప్పి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్ని నాని చెబుతున్నారు. అంటే కేవలం ప్రజల మీద భారం పడకూడదని చెప్పి జగన్ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఈ కార్యక్రమం చేస్తుందని నాని అంటున్నారు. సరే జగన్ ప్రభుత్వానిది పెద్ద మనసు అనుకుంటే, అన్నీ ధరలు నియంత్రణలో ఉంటే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు.

ఏపీలో పేద, మధ్య తరగతి ప్రజలు ఏది కొనేలా లేదని, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇక పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇసుక ఇలా ప్రతిదీ పెరిగిపోయాయి. ఇక వైన్స్‌లో ఏం జరుగుతుందో తెలిసిందే. అటు పన్నుల భారం. కరెంట్ ఛార్జీలు తడిచి మోపెడు అవుతున్నాయి. ఇక రవాణా శాఖ మంత్రిగా ఉన్న పేర్ని నాని కంట్రోల్‌లో ఉండే ఆర్‌టిసి చార్జీలు ఏ రేంజ్‌లో పెరిగాయో చెప్పాల్సిన పని లేదు.

దసరా సందర్భంగా ఆర్‌టీసీ చార్జీల బాదుడు మొదలైంది. దారుణంగా ఆర్‌టిసి ఛార్జీలు పెరిగాయి. అంటే నాని మాటలు ఒకలా, చేతలు మరొకలా ఉన్నాయని చెప్పొచ్చు. సినిమా టిక్కెట్లని నియంత్రణలో పెట్టాలని అనుకుంటే, మిగతా అన్నీ ధరలని నియంత్రణలో పెట్టాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వానిది.

Discussion about this post