అధికార వైసీపీలో వెటకారంగా పంచులు వేయడంలో ధిట్ట ఎవరైనా ఉన్నారంటే అది మాజీ మంత్రి పేర్ని నాని మాత్రమే అని చెప్పొచ్చు…ఈయన మీడియా సమావేశాల్లో ఏ విధంగా ప్రతిపక్షాలపై సెటైర్లు వేస్తారో చెప్పాల్సిన పని లేదు…ఎప్పటికప్పుడు పవన్, చంద్రబాబుని ఎగతాళి చేయడానికే చూస్తూ ఉంటారు. అయితే ప్రతిపక్షాలని ఎగతాళి చేయాలని చూస్తున్న పేర్నికి…తాను ఎగతాళి అవుతున్న అనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు..తనని గెలిపించిన బందరు ప్రజలు బాగా తిట్టుకుంటున్నారనే విషయాన్ని అర్ధం చేసుకోవడం లేదు.

మొన్నటివరకు మంత్రిగా చేసిన సరే బందరు ప్రజలకు పెద్దగా ఒరిగింది ఏమి లేదు..బందరులో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు…అసలు వైసీపీ అధికారంలోకి వచ్చాక బందరులో ఎలాంటి మార్పులు జరగలేదు…ఒకవేళ జరిగిన మార్పు ఏదైనా ఉందంటే….అది పేర్ని కుమారుడుకు పెత్తనం దక్కడం…అసలు బందరు ఎమ్మెల్యే పేర్ని నా లేక ఆయన కుమారుడో అర్ధం కాకుండా ఉంది. పేర్ని కుమారుడు పెత్తనం పెరగడం వల్ల వైసీపీకి ఇంకా నెగిటివ్ అవుతుంది.

పైగా ఎన్నడూలేని విధంగా పేర్నికి బ్యాడ్ నేమ్ వచ్చింది…అసలు పేర్నికి ప్రజల మనిషిగా పేరుంది…కానీ వైసీపీలోకి వచ్చాక పేర్నిలో మార్పు కనిపిస్తోంది…ఎంతసేపు ప్రతిపక్షాలని తిట్టడం తప్పితే…ఆయన ప్రజలకు చేసింది ఏమి కనబడటం లేదు…అసలు పేర్ని మారిపోయారని..ఆయన్ని అభిమానించే వారే మాట్లాడుకునే పరిస్తితి. మొత్తానికి బందరులో పేర్నికి పెద్దగా పాజిటివ్ లేదు.

ఇక ఇదే సమయంలో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ…వారి సమస్యలపై పోరాడుతున్నారు..పైగా కొల్లుని పలుమార్లు అక్రమ అరెస్టులు చేశారనే సానుభూతి ప్రజల్లో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో నెక్స్ట్ ఎన్నికల్లో బందరులో కొల్లు విజయం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ జనసేనతో పొత్తు ఉంటే కొల్లు భారీ విజయం సాధించడం ఖాయమని, అలా కాకుండా టీడీపీ సింగిల్ గానే పోటీ చేసిన సరే కొల్లు విజయం ఆపడం కష్టమే అంటున్నారు.

Discussion about this post