ఏ నాయకుడుకైన అధికారం అనేది అడ్వాంటేజ్ అవుతుంది…కానీ ఏపీలో ఉన్న వైసీపీ నేతలకే అదే మైనస్ అయ్యేలా ఉంది..అధికారం ఉంది కదా అని…ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే అధికార నేతలకు నెగిటివ్ అవుతుంది. ఎక్కడైనా అధికారం ఉంటే ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందించి…ఇంకా ప్రజా మద్ధతు పొందాలి…కానీ ఏపీలో అధికార నేతలు మాత్రం…ప్రజలకు సేవ చేయడం కంటే…తమకు సేవలు చేయించుకుంటున్నారు. అధికార పెత్తనంతో ముందుకెళుతున్నారు.

ఇలా వెళ్ళడం వల్లే మెజారిటీ వైసీపీ నేతలకు నెగిటివ్ ఎక్కువ కనిపిస్తోంది…ఇదే క్రమంలో మంత్రి పేర్ని నానికి కూడా పాజిటివ్ తగ్గినట్లు తెలుస్తోంది. ఈయనకు ప్రతిపక్షంలో ఉండగానే పాజిటివ్ ఎక్కువగా ఉంది…కానీ అధికారంలోకి రావడం, మంత్రి అయ్యాక పాజిటివ్ తగ్గిపోతూ వస్తుంది. అధికారం ఉంది కదా అని..ప్రతిపక్ష నేతలని రాజకీయంగా తోక్కేసే ప్రయత్నాలు చేయడం..అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాలకు అందుబాటులో ఉండి…అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దూరం జరగడం పేర్నికి బాగా నెగిటివ్ అయింది.

అలాగే పేర్ని వారసుడు సైతం మైనస్ అయ్యేలా ఉన్నారు…అసలు ఏ విధమైన అధికారం లేని పేర్ని వారసుడు…మచిలీపట్నంలో బాగానే పెత్తనం చేస్తున్నారు..అన్నీ అంశాల్లోనూ పేర్ని వారసుడు జోక్యం పెరిగిపోయింది. ప్రభుత్వ ఆఫీసుల్లో పేర్ని వారసుడు హవా ఎక్కువ కనిపిస్తోంది. ఇక తాజాగా పేర్ని వారసుడు పుట్టినరోజు సందర్భంగా కొందరు వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో మచిలీపట్నంలో టౌన్‌లో ఎడాపెడా ఫ్లెక్సిలు పెట్టేశారు…ఎవరికి వారే పేర్ని వారసుడు దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు.

ఇక తాజాగా పోలవరం పర్యటనకు వెళ్ళి..అక్కడ పార్కింగ్‌కు అడ్డు ఉందని మంత్రి కారుని పక్కన పెట్టమంటే పోలీసులపై…పేర్ని నాని ఏ విధంగా ఫైర్ అయ్యారో తెలిసిందే. ఇలా ఒకటి ఏంటి అనేక ఘటనలు మంత్రి పేర్ని నానికి మైనస్ అవుతున్నాయి…ఇక పవన్‌తో కయ్యం పెట్టుకుని..మచిలీపట్నంలో ఉన్న కాపు వర్గాన్ని కూడా దూరం చేసుకునే పరిస్తితికి వచ్చారు..ఇలా అన్నీ విధాలుగా పేర్నికి పాజిటివ్ తగ్గుతున్నట్లే కనిపిస్తోంది.

Discussion about this post