రాష్ట్రంలో టీడీపీ బలపడుతున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీకి ధీటుగా టిడిపి పికప్ అవుతూ వస్తుంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన నియోజకవర్గాల్లో సగం పైనే టిడిపి పుంజుకుంది..ఆధిక్యంలోకి వచ్చింది. ముఖ్యంగా టీడీపీకి మొదట నుంచి అండగా ఉంటున్న పేటల్లో వేగంగా పుంజుకుంది పేట పేరున్న నియోజకవర్గాల్లో టిడిపి గెలుపు దిశగా వెళుతుంది.
గత ఎన్నికల్లో టిడిపి..నరసన్నపేట, పాయకరావుపేట, జగ్గంపేట, కొత్తపేట, జగ్గయ్యపేట, చిలకలూరిపేట, నరసారావుపేట, సూళ్ళూరుపేట, రాజంపేట…ఇలా పేట పేరున్న ప్రతి నియోజకవర్గంలో ఓటమి పాలైంది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అన్నీ సీట్లు వైసీపీ గెలుచుకుంది. కానీ ఈ సారి సీన్ మారుతుంది. పేటల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తుంది. టిడిపి బలపడుతుంది. అయితే కొన్ని సీట్లలో టిడిపి ఇంకా బలపడాల్సి ఉంది. నరసన్నపేటలో టిడిపి ఇంకా బలపడాలి. ఇక్కడ వైసీపీకి స్వల్ప ఆధిక్యం ఉంది. ఇక పాయకరావుపేటలో వైసీపీకు ఫుల్ యాంటీ ఉంది..టిడిపి ఆధిక్యంలోకి వచ్చి గెలుపు దిశగా వెళుతుంది.

జగ్గంపేట, కొత్తపేట నియోజకవర్గాల్లో అదే పరిస్తితి..గత రెండు ఎన్నికల్లో ఇక్కడ టిడిపి గెలవలేదు..కానీ ఈ సారి గెలుపు ఖాయమని చెప్పవచ్చు. అటు జగ్గయ్యపేటలో టిడిపికి ఫుల్ లీడ్ ఉంది..డౌట్ లేకుండా గెలవడం ఖాయం. చిలకలూరిపేటలో కూడా టిడిపిదే లీడ్. అయితే నరసారావుపేటలో టిడిపి బలపడలేదు…వైసీపీకే ఆధిక్యం ఉంది. సూళ్ళూరుపేటలో టిడిపి, వైసీపీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.
ఇక రాజంపేట స్థానంలో వైసీపీ గ్రాఫ్ డౌన్ అయింది. ఇక్కడ టిడిపి ఆధిక్యం వచ్చింది. అంటే రెండు, మూడు స్థానాలు మినహా…మిగిలిన పేట స్థానాల్లో టిడిపి హవా ఉంది. ఈ సారి ఎక్కువ సీట్లు గెలవడం ఖాయం.
