జగన్ ప్రభుత్వం యూటర్న్‌ల మీద యూటర్న్‌లు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అంశాల్లో ప్రభుత్వం యూటర్న్‌లు తీసుకుంది. తాజాగా మూడు రాజధానుల నిర్ణయంపై వెనక్కి తగ్గింది…అలాగే మండలి రద్దుపై వెనక్కి తగ్గింది. ఈ రెండు నిర్ణయాలని మొదట తీసుకుని, ఇప్పుడు ఉపసంహరించుకుంది. అంటే సమయాన్ని బట్టి రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

అయితే జగన్ తీసుకుంటున్న యూటర్న్‌ల వల్ల సొంత పార్టీ వాళ్లే నష్టపోయే పరిస్తితి ఉంది. అసలు మొదట మండలి రద్దు నిర్ణయం తీసుకోవడం వల్ల పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలు నష్టపోయిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కోటాలో మంత్రులు అయిన ఈ ఇద్దరు…మండలి రద్దు నిర్ణయంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే వెంటనే జగన్…వారికి రాజ్యసభ పదవి ఇచ్చారు.

కానీ ఇప్పుడు మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీని వల్ల వారు పరోక్షంగా మంత్రి హోదాని మిస్ అయినట్లే. పైగా మోపిదేవికి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఎలాగో తనకు రేపల్లె సీటు ఉంది. కానీ పిల్లికి మాత్రం ఏ సీటు లేదు. రాజ్యసభ పదవీకాలం ముగిస్తే…నెక్స్ట్ ఏ పదవి వస్తుందనే గ్యారెంటీ లేదు. పైగా సీటు కూడా గ్యారెంటీ లేదు. కానీ శాసన మండలి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని కవర్ చేసుకుంటున్నారు.

ఇలా జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉన్న పిల్లికి నెక్స్ట్ ఎన్నికల్లో ఏ సీటు వచ్చే అవాకాశం లేదు. ఎందుకంటే ఈయన సొంత సీటు రామచంద్రాపురం ఇప్పుడు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ చేతిలో ఉంది. ఇక గత ఎన్నికల్లో పిల్లి పోటీ చేసి ఓడిపోయిన మండపేట సీటు…తన చిరకాల ప్రత్యర్ధి తోట త్రిమూర్తులు చేతిలో ఉంది. అంటే రెండు సీట్లు ఖాళీగా లేవు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో పిల్లి సుభాష్ పరిస్తితి ఏంటి అనేది క్లారిటీ లేదు.

Discussion about this post