నిజానికి ఒకప్పుడు రాజకీయాలు చాలా హుందాగా నడిచేవి…అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయం బాగుండేది..ఏదైనా పాలసీ పరంగానే విమర్శలు చేసుకునే వారు…ఎప్పుడు కూడా వ్యక్తిగత కక్షలతో ముందుకెళ్లడం, వ్యక్తిగతంగా దూషించడం లాంటివి జరిగేవి కాదు. కానీ ఎప్పుడైతే ఏపీ రాజకీయాల్లోకి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయ్యారో అప్పటినుంచి సీన్ మారిపోయింది. ఆయన వైసీపీకి పనిచేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి రాజకీయం మరో లెవెల్ కు వెళ్లింది. కుట్రలు, కక్షలు తప్ప మరొకటి ఉండటం లేదు.

ఇక పీకే జిమ్మిక్కులు ఎలా ఉంటాయో..గత ఎన్నికల్లో అంతా చూశారు..పీకే వల్లే వైసీపీ కూడా భారీ విజయాన్ని దక్కించుకుందని చెప్పొచ్చు. ఇప్పటికీ పీకే టీం…వైసీపీకి పనిచేస్తుంది. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో జగన్ ని గెలిపించేందుకు చూస్తుంది. అయితే రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు జరిగిన దాని వెనుక పీకే టీం ఉందనే అనుమానం అందరికీ వస్తుంది. అంటే పీకే రాజకీయాలు ఎలా ఉంటున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త స్క్రిప్ట్ లతో వస్తూనే ఉన్నారు.

ఈ మధ్య జగన్ గాని, వైసీపీ నేతలు గాని…ఓ మీడియా వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆ మీడియా తమపై కుట్రలు చేస్తుందని, తాము మంచి చేస్తుంటే అడ్డుకుంటుందని చెప్పుకొస్తున్నారు. అసలు జగన్ ప్రభుత్వం తప్పులే చేయనట్లు మాట్లాడుతున్నారు. నిజానికి ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులని, కక్ష సాధింపు చర్యలని ఆ మీడియా సంస్థలు ఎండగడుతున్నాయి. ఇక దాని వల్ల తమకు నెగిటివ్ అవుతుందని భావించి…వైసీపీ వాళ్ళు ఆ మీడియా సంస్థలని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.

పీకే స్క్రిప్ట్ లో భాగంగానే జగన్ గాని, ఇతర వైసీపీ నేతలు గాని ఒకే విధంగా మీడియాపై విమర్శలు చేస్తున్నారు. అంటే ఆ మీడియాని ప్రజలు నమ్మకూడదనే కోణంలో రాజకీయం చేస్తున్నారు. పైగా వీరికి భజన చేసే మీడియా సంస్థలే గొప్పవి అన్నట్లుగా చెప్పుకుంటున్నారు. అయితే జగన్ మాటలని ప్రజలు పూర్తిగా నమ్మే స్థాయిలో లేరనే చెప్పాలి..గతంలో అంటే నమ్మి మోసపోయారు గాని, ఇప్పుడు ఆ పరిస్తితి లేదనే చెప్పాలి. మొత్తానికి పీకే జిమ్మిక్కులు మాత్రం పెద్దగా వర్కౌట్ కావనే చెప్పాలి.

Discussion about this post