రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో తమకు ఇక పనిలేదని .. వైసీపీ అధినేత తరఫున ఆ పార్టీ కీలక నాయకుడు, సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎందుకంటే.. 2014లో సొంత వ్యూహాలతో జగన్ వేసిన అడుగులు వికటించా యి. దీంతో ఆయన ఆదరాబాదరాగా.. ఢిల్లీ నుంచి పీకేను రప్పించుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే పాదయాత్ర చేసి.. 2019లో వైసీపీ నాయకులే ఊహించని విధంగా అధికారం చేపట్టా రు.

అయితే.. ఇప్పుడు అనూహ్యంగా పీకేను పక్కన పెట్టారు. మరి ఈ ధీమా ఏంటి? ఎందుకు? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో తాను చేస్తున్న సంక్షేమమే.. కలిసి వస్తుందని.. తాను ప్రకటిం చిన పథకాలే.. ప్రజలు తనను గెలిపించేస్తాయనే అతివిశ్వాసంతో జగన్ ఉన్నారా? అనేది చర్చకు వస్తున్న ప్రధాన విషయం.ఇదిలావుంటే.. వైసీపీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న టీడీపీ నాయకులు.. తమదే గెలుపని ధీమాకు వచ్చేశాయి.

ఎందుకంటే గత ఎన్నికల సమయంలో తాము కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని.. అయితే .. ప్రజలు గెలిపించలేదని.. ఇప్పడు సేమ్ సీన్ రిపీట్ అవుతుందని.. తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. “వైసీపీ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. మాకు మేలు చేస్తుందా.. కీడు చేస్తుందా.. అనేది పక్కన పెడితే.. మేం అనుకున్న విధంగా ముందుకు సాగితే.. విజయం మాకే దక్కుతుంది“ అని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.

ఇక, ఇదే తరహా ఆలోచన ఇతర నాయకుల్లోనూ కనిపించింది. పీకే వల్ల.. వైసీపీ పుంజుకుందని.. అయితే.. ఇప్పుడు ఆయనను పక్కన పెట్టి.. జగన్ వ్యూహాలతో వెళ్లడం వల్ల.. ఏమేమరకు విజయం దక్కించుకుంటా రో.. చూడాలని అనంతపురం జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నేత వ్యాఖ్యానించారు. అంటే..ఇప్పటి వరకు పీకే ఆలోచనలతోనే వైసీపీ గెలిచిందని.. జగన్ ఆలోచనలు పనికిరాలేదని.. రాజకీయాల్లో చర్చ ఉంది. ఇప్పుడు పీకేను తీసేయడం ద్వారా.. జగన్ తప్పు చేశారనే భావనతోపాటు.. టీడీపీలో ఉత్సాహం నెలకొనడం గమనార్హం.

Discussion about this post