బీపీ…ఇప్పుడు ఏపీలో హల్చల్ చేస్తున్న మాట. టిడిపి నేత పట్టాభి జగన్‌ని ఉద్దేశించి బొషడికే అనే తిట్టడంతో వైసీపీ శ్రేణులకు బీపీ పెరిగి…టిడిపి ఆఫీసులపై దాడి చేశారు. ఇదే సిఎం జగన్‌తో సహ వైసీపీ నేతలు చెబుతున్న మాట. అంటే అక్కడ పట్టాభి..జగన్‌ని తిట్టారో లేక సజ్జలని తిట్టారో ఎవరికీ క్లారిటీ లేదు. కానీ ఏది ఎలా జరిగినా ఒక ప్లాన్ ప్రకారం మాత్రం టిడిపి ఆఫీసులపై దాడులకు దిగారని మాత్రం తెలుస్తోంది.

ఇక ఆ బొషడికే పదానికి జగన్, వైసీపీ నేతలు సరికొత్త అర్ధాన్ని పెట్టుకుని మరీ…టిడిపిపై ఫైర్ అవుతున్నారు. అలా అనుకుంటే వైసీపీ నేతలు ఎన్నిసార్లు ఎన్నిరకాలుగా చంద్రబాబుని, పవన్ కల్యాణ్‌ని తిట్టారో చెప్పాల్సిన పని లేదు. మరి అప్పుడు టిడిపి శ్రేణులకు, జనసేన శ్రేణులకు బీపీలు పెరిగితే పరిస్తితి ఏంటి అనేది ఒక పాయింట్.

కాకపోతే వారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి బీపీలు పెంచుకోకూడదు…పెంచుకుంటే జైలుకు వెళ్ళాల్సిందే. అదే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, బీపీ ఊరికే వచ్చేస్తుంది…బీపీతో ఏదైనా చేసేస్తారు…కానీ చేసిన వాళ్ళు జైలుకు వెళ్లారు…చేయించుకున్నవారు జైలుకు వెళ్తారని టిడిపి శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

ఇక దాడులని ఖండించకపోగా, బీపీ పెరిగి దాడులు చేశామని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. సరే ఒక మాట అన్నందుకే బీపీ పెరిగితే….జగన్ ప్రతిపక్షంలో ఉండగా విశాఖ ఎయిర్‌పోర్టులో కోడికత్తితో దాడి చేశారు. మరి అప్పుడు వైసీపీ వాళ్ళకు బీపీలు ఎందుకు పెరగలేదని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇది కూడా పాయింటే.

ఎందుకంటే అంతపెద్ద ఘటన జరిగింది…పైగా బాబోయ్…మా జగనన్నని చంద్రబాబు, లోకేష్‌లు చంపించడానికి ప్లాన్ చేశారని వైసీపీ వాళ్ళు గగ్గోలు పెట్టేశారని, కానీ ఎక్కడా బీపీలు పెంచుకుని, టిడిపి ఆఫీసులపై దాడులు చేయలేదని, అప్పుడు లేని బీపీ ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజల్లో జగన్ పాలన పట్ల బీపీ పెరుగుతుంది కాబట్టే, దాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ వాళ్ళు బీపీలు పెంచుకున్నారని అంటున్నారు.

Discussion about this post