ఏపీ రాజకీయాలు బాగా హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఓ వైపు వైసీపీని ప్రతిపక్ష టిడిపి గట్టిగా టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తుంది. అటు వైసీపీ నేతలు కూడా టిడిపికి కౌంటర్లు ఇచీ ప్రయత్నం చేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ సైతం జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి దూకుడుగా రాజకీయం స్టార్ట్ చేశారు. తాజాగా సినిమా టికెట్ల అమ్మకంపై ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్…జగన్ గతంలో హామీలు ఇచ్చి ఇప్పుడు మాట ఎలా తప్పారనే అంశాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు.

అయితే పవన్ కూడా పరుష పదజాలం వాడి మరీ జగన్, మంత్రులపై ఫైర్ అయ్యారు. దీంతో మంత్రులు కూడా పవన్‌కు అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. దారుణంగా పవన్‌ని తిట్టారు. ఇలా పవన్-వైసీపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. ఇక వార్‌లోకి సినీ నటుడు, వైసీపీ నేత పోసాని మురళీకృష్ణ వచ్చారు. సిఎం, మంత్రులని పవన్ నోటికొచ్చినట్లు తిడతారా? దిల్ రాజు రెడ్డి.. మీరు రెడ్డి ఆయన రెడ్డి.. మీరు మీరు మాట్లాడుకోండి అని అంటారా? అంటూ పోసాని ఫైర్ అయ్యారు.

జగన్‌కు కులపిచ్చి ఉందని ఎవ్వరైనా నిరుపిస్తారా?అని మాట్లాడారు. అలాగే పవన్ వ్యక్తిగతమైన అంశాలపై కూడా విమర్శలు చేశారు. అయితే ఆ విషయాలని పక్కనబెడితే….జగన్‌కు కులపిచ్చి ఉందని నిరూపించాలని పోసాని సవాల్ చేయడమే విడ్డూరంగా ఉందని టిడిపి-జనసేన శ్రేణులు అంటున్నాయి.జగన్‌కు ఎంత కులపిచ్చి ఉందో ఈ రెండున్నర ఏళ్లలో ప్రజలు బాగానే చూశారని, అలాగే ఎంతమంది రెడ్లకు పదవులు ఇచ్చారో కూడా తెలుసని, ఆ విషయం పోసానికి కనబడకపోవడం కాస్త వింతగా ఉందని అంటున్నారు.

తాజాగానే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఏపీఎన్‌జీవోస్ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డిని నియమించేందుకు సిద్ధమయ్యారని, అసలు ఇంకెంత మంది రెడ్లకు పదవులు ఇచ్చారో, అలాగే ఇతర కులలపై దాడులు ఎలా జరుగుతున్నాయో పోసానికి కనబడలేదా? అని ప్రశ్నిస్తున్నారు. జగన్‌కు కులపిచ్చి లేదని పోసాని అనడం పెద్ద జోకుగా ఉందని అంటున్నారు.

Discussion about this post