ఏపీలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారుతున్నాయి..వైసీపీ చేసే రాజకీయ ఎత్తులకు చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేనలు కలవడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. రెండు పార్టీలు దాదాపు పొత్తు పెట్టుకోవడం ఫిక్స్ అని చెప్పవచ్చు. అందుకే తాజాగా చంద్రబాబు-పవన్ కలవడంపై పెద్ద ఎత్తున వైసీపీ విమర్శలు చేస్తుంది. దాదాపు పొత్తు లేకుండా టార్గెట్ గా పెట్టుకున్నారు..పొత్తు ఉంటే దాన్ని విఫలం చేయాలని చూస్తున్నారు.

అయితే వైసీపీ ఎన్ని ఎత్తులు వేసిన టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమైనట్లే తెలుస్తోంది. గత ఎన్నికల్లో పొత్తు లేకపోవడం వల్ల వైసీపీకి ప్లస్ అయింది. ఓట్లు చీలిపోయి వైసీపీ 151 సీట్లు గెలుచుకుంది. ఒకవేళ అప్పుడే పొత్తు ఉంటే వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేదీ..ఓ 50 స్థానాల్లో వైసీపీకి గెలుపు ఈజీ అయ్యేది కాదు. కానీ ఈ సారి వైసీపీకి ఆ పరిస్తితి రాకుండా చేయాలని టీడీపీ-జనసేనలు ప్రయత్నిస్తున్నాయి. ఇక పొత్తు ఉంటే ఇప్పుడు విమర్శలు చేస్తున్న చాలామంది వైసీపీ నేతలకు చెక్ పడటం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

అంబటి రాంబాబు, అప్పలరాజు,కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, రోజా, గుడివాడ అమర్నాథ్, కారుమూరి నాగేశ్వరావు, చెల్లుబోయిన వేణుగోపాల్, ధర్మాన ప్రసాద్ రావు, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, అవంతి శ్రీనివాస్…ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు పొత్తు వల్ల నష్టం జరుగుతుంది.

ఎందుకంటే గత ఎన్నికల్లో వీరు టీడీపీపై గెలిచిన మెజారిటీల కంటే జనసేనకు పడిన ఓట్లే ఎక్కువ. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పొత్తు ప్రభావం ఎక్కువ ఉండనుంది. ఈ ఐదు జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు ఎక్కువ రిస్క్ ఉంటుంది.

Leave feedback about this