టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాజాగా పొత్తులకు సంబంధించి సంకేతాలు ఇచ్చేశారు. కలిసి వచ్చే పార్టీలో వైసీపీ పై యుద్ధం చేస్తామని.. ఆయన చెప్పేశారు. అంతేకాదు.. వైసీపీ అరాచక పాలనపై పార్టీలు అన్నీ కలిసి కట్టుగాయుద్ధం చేయాల్సిన అవసరం వచ్చిందని.. అన్నారు. ఇక, ప్రజా పోరాటానికి.. టీడీపీ నాయకత్వం కూడా వస్తుందన్నారు. అయితే.. చంద్రబాబు వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడడం సరికాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయితే, దీనిపై పార్టీ సీనియర్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. “ఇది మంచి పరిణామం. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పనాయకులను , కార్యకర్తలను చంద్రబాబు మానసికంగా సిద్ధం చేయడం మంచిది. ఎన్నికల వరకు సాగదీసి.. అప్పుడు పొత్తులు అంటే.. కష్టం. కాబట్టి దీనిగురించి ఆయన చేసిన బాగానే ఉంది“ అని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇక, ఇదే విషయంపై ఉత్తరాంధ్రలోనూ ఇదే టాక్ వినిపిస్తోంది.

ఎన్నికల వరకు సాగదీయకుండా.. పొత్తుల విషయంలో చంద్రబాబు సంకేతాలు ఇవ్వడం ద్వారా.. నాయకులు.. కార్యకర్తలు కూడా సంసిద్ధంగా ఉంటారని..అ దేసమయంలో సామాజిక వర్గాల పరంగా కూడా పార్టీకి కనెక్ట్ అవుతారని చెబుతున్నారు. ఇలాంటి సమయంలోనే పొత్తులపై ప్రకటించడం.. సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. రాజకీయాల్లో పొత్తులు సహజమేనని.. ఎవరూ శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరనిచెబుతున్నారు.

“శత్రువు బలంగా ఉన్నప్పుడు.. ఒంటరి పోరాటం ఎలా చేస్తాం. కాబట్టి పొత్తు పెట్టుకుంటే.. వచ్చే నష్టం లేదు. మా టార్గెట్ మాకు ఎలానూ ఉంటుంది. ఈ విషయంలో చంద్రబాబు ప్రకటనే ఫైనల్“ అని విజయవాడకు చెందిన ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు వ్యాఖ్యానించారు. సో.. ప్రస్తుతం చంద్రబాబు చేసిన కామెంట్లపై వస్తున్న విమర్శలను.. వీరు తిప్పికొట్టడం గమనార్హం.

Discussion about this post