రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే గుడివాడలో కొడాలి నాని గెలుపుకు వచ్చిన ఢోకా ఏం లేదు అని ఆయన అభిమానులు గాని, రాజకీయ విశ్లేషకులు అని అంటుంటారు. అంటే అంతలా గుడివాడపై కొడాలికి గ్రిప్ ఉందని. లేటెస్ట్ సర్వేల్లో కూడా గుడివాడలో కొడాలికి మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయని తేలింది. అయితే వరుసగా రెండుసార్లు టిడిపి, రెండు సార్లు వైసీపీ నుంచి కొడాలి గెలిచారు. ఇందులో మూడుసార్లు ప్రతిపక్షంలో ఉన్నారు..అందుకే ప్రజలు ఏమి ఆలోచించే వారంటే అధికారంలో లేరు కదా..అందుకే కొడాలి గుడివాడకు ఏం చేయలేకపోయారని మళ్ళీ మళ్ళీ ఓటు వేస్తూ వచ్చారు.

కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు..మంత్రిగా మూడేళ్లు చేశారు…అయినా గుడివాడకు ఒరిగింది ఏమి లేదు. అయినా గుడివాడలో కొడాలికి లీడ్ ఉంది. కారణంలో టిడిపి బలంగా లేకపోవడం..ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేకపోవడం..నేతలు కలిసికట్టుగా పనిచేయకపోవడం..ఇవే కొడాలికి ప్లస్. అంటే యాంటీ ఉన్నా సరే టిడిపి వల్లే కొడాలికి ప్లస్ అవుతుంది. పైగా ఈయనకు పార్టీలతో సంబంధం లేకుండా ప్రత్యేకమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది..అందుకే గెలవగలుగుతున్నారు.

అయితే ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టిడిపి-జనసేన పొత్తు సెట్ అయ్యేలా ఉంది. అలా జరిగితే కొడాలికి రిస్క్. కాకపోతే ఇక్కడ కాపులు మొన్నటివరకు కొడాలి వైపే ఉన్నారు. అందుకే 2014లో టిడిపికి జనసేన మద్ధతు ఇచ్చిన కొడాలి గెలిచారు. కానీ ఈ సారి ఆ పరిస్తితి లేదు. కాపుల్లో కొడాలిపై వ్యతిరేకత కనిపిస్తుంది..ఇటు బీసీలు కాస్త మారుతున్నారు. ఎస్సీల్లో కూడా కాస్త చేంజ్ వస్తే గుడివాడలో కొడాలికి ఈ సారి చెక్ పడిపోవడం ఖాయం. పొత్తు ప్రభావంతోనే గుడివాడలో కొడాలికి రిస్క్ తప్పదు.