తెలుగు వారిఆత్మగౌరవ నినాదంతో ఏర్పడ్డ తెలుగు దేశం పార్టీ.. విషయంలో పార్టీ నాయకులు.. కొన్ని కీల క వ్యాఖ్యలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి వేరే వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను.. లేదా తెరచాటున సాగుతున్న పరిణామాలను వారు వద్దని చెబుతున్నారు. టీడీపీని తీసుకుంటే.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న పార్టీ. 14 ఏళ్లపాటు.. ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ. అంతకు మించి.. కేంద్రంలో చక్రం తిప్పిన పార్టీ.

ఇప్పుడు అలాంటి పార్టీ పొత్తుల కోసం ప్రయత్నించడం తప్పుకాకున్నా.. పొత్తుల విషయంలో ఇతర పార్టీల నుంచి వస్తున్న ప్రతిపాదనలనే తమ్ముళ్లు తప్పుపడుతున్నారు. ఎందుకంటే.. ఇటు జనసేనను చూసినా.. అటు బీజేపీని గమనించినా.. తమతో పొత్తు పెట్టుకోవాలంటే.. తమ వద్దకు రావాలని.. చర్చిం చాలని.. ఇరు పార్టీలు చూచాయగా చెబుతున్నారు. జనసేన అయితే.. ఖచ్చితంగా.. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. తమతో పొత్తు కోసం.. ఎవరైనా ప్రయత్నిస్తే.. వచ్చి చర్చించాలని.. పవన్ స్వయంగా చెప్పారు.

ఇక, బీజేపీ అయితే.. తమకు ఎవరితోనూ పొత్తులు అవసరం లేదని అంటూనే.. పొత్తులపై ఇప్పుడే మాట్లా డేది లేదని చెప్పింది. అదేసమయంలో ఎవరి షరతులకూ తాము తలొగ్గబోమని.. తమకంటూ.. కొన్ని విధానాలు ఉన్నాయని.. వాటిని అందిపుచ్చుకునే పార్టీలతోనేతాము చేతులు కలుపుతామని స్పష్టం చేసింది. అంటే.. పార్టీ ఏదైనా.. తమదే పైచేయిగా ఉండాలని.. బీజేపీ చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనినే తమ్ముళ్లు పూర్తి స్థాయిలో తప్పుబడుతున్నారు.

“ఇన్నాళ్లుగా పార్టీ అనేక ఉత్థాన పతనాలు చవిచూసింది. ఇప్పుడు పోయి పోయి.. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి వ్యవహరించాల్సిన అవసరం లేదు. ప్రజలకు పార్టీపైనా.. పార్టీకి ప్రజలపైనా నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో మరింతగా కష్టపడితే.. ప్రజల్లోనే ఉండి.. వారి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తే.. ఇలాంటి వారితో పొత్తులు ఎందుకు? సొంతగానే అధికారంలోకి వస్తాం!“ అని సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని మిగిలిన నేతలు కూడా అంటున్నారు. మొత్తానికి టీడీపీలో ఈ తరహా చర్చ సాగడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post