ఏమైందో గానీ ఈ మధ్య విజయసాయి రెడ్డి కాస్త దూకుడుగా రాజకీయాలు చేయడం తగ్గించారు. అసలు మొన్నటివరకు మాటకు మెదిలితే సోషల్ మీడియాలోకి వచ్చేసి చంద్రబాబుపై విమర్శలు చేసేవారు. కానీ ఈ మధ్య అలాంటి కార్యక్రమాలు ఏమి చేయడం లేదు. ఆ మధ్య పవన్ కల్యాణ్ ఏ స్థాయిలో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారో తెలిసిందే. పవన్‌కు వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ విజయసాయి మాత్రం స్పందించలేదు.

అసలు ఇలా పూర్తిగా సైలెంట్ అవ్వడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. ఇదే సమయంలో విజయసాయి…విశాఖపట్నంలో సైలెంట్‌గా పనులు చేసుకుంటున్నారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. అలాగే సాయన్న దర్బార్ పేరిట ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. అయితే విజయసాయి ఇలా పూర్తిగా మారడానికి కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు.

వైసీపీలో విజయసాయి పెత్తనం తగ్గించే కార్యక్రమం జరుగుతుందని కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో విజయసాయి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని, అందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా ఉన్న విజయసాయి…నెక్స్ట్ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎలాగో విశాఖలోనే సెటిల్ అయిపోతానని విజయసాయి ఎప్పుడో చెప్పేశారు.

అందుకే అక్కడ నుంచే పోటీకి దిగడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే విజయసాయిని మాత్రం సైడ్ చేయాలని విశాఖ వైసీపీ నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. వేరే జిల్లా నుంచి ఇక్కడ తమ పెత్తనం చేయడంపై విశాఖ వైసీపీ నేతలు లోలోపల రగిలిపోతున్నారట. రాష్ట్రానికి జగన్ సిఎం అయితే, తమకు విజయసాయి సిఎంలా తయారయ్యారని, ఆయన పెత్తనం నుంచి ఎలాగైనా విముక్తి పొందాలని అక్కడ నాయకులు చూస్తున్నారట. అందుకే ఆయనకు సీటు కూడా ఇవ్వొద్దని జగన్‌ని రిక్వెస్ట్ చేయాలని చూస్తున్నారట. చూడాలి మరీ విశాఖలో విజయసాయి రాజకీయం ఎలా ఉంటుందో..?

Discussion about this post