ఏపీలో కరెంట్ కష్టాలు మొదలవుతున్నట్లు కనిపిస్తున్నాయి….గత ఏడేళ్లుగా రాష్ట్రంలో కరెంట్ కష్టాలు లేవనే చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కరెంట్ కోతలు ఎక్కువగా ఉండేవి. కానీ రాష్ట్ర విభజన జరిగాక, చంద్రబాబు సిఎం అయ్యాక పరిస్తితి మారింది. అనూహ్యంగా రాష్ట్రానికి మిగులు కరెంట్ వచ్చింది….ఇక చంద్రబాబు విధానాల వల్ల కూడా 24 గంటల కరెంట్ ఏపీలో నడిచింది. దీని వల్ల అసలు కరెంట్ కోతలు చూడలేదు.

ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ హయాంలో కూడా కరెంట్ కోతలు రాలేదు. మొన్నటివరకు కోతలు లేవు. కానీ ఇటీవలే రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయి. గ్రామాల్లో అనధికారికంగా కరెంట్ కోతలు కొనసాగుతున్నాయి. అసలు వర్షాకాలమే కరెంట్ పోతే, వేసవిలో పరిస్తితి ఎలా ఉంటుందని ప్రజలు భయపడుతున్నారు. అయితే కరెంట్ సమస్య దేశం మొత్తం ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ కొన్ని రాష్ట్రాలు ముందు జాగ్రత్త పడి….ప్రజలకు 24 గంటల కరెంట్ అందేలా చూసుకోవడానికి రెడీ అవుతున్నాయి.

కానీ ఏపీలో జగన్ ప్రభుత్వం మాత్రం ముందే చేతులెత్తేసింది. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కరెంట్ కోతలపై క్లారిటీ ఇచ్చేశారు….ఇళ్ళల్లో కరెంట్ వాడకం కాస్త తగ్గించాలని మాట్లాడారు. రోజూ సాయంత్రం 6గంటల నుంచి 10గంటల వరకు ఒక్క ఫ్యాన్ మినహా ఇతర గృహ అవసరాలకు చెందిన ఎలక్ట్రానిక్ యంత్రాలేవీ ఇళ్లల్లో వినియోగించవద్దంటూ సెలవిచ్చారు. వాడకం సంగతి పక్కనబెడితే దసరా తర్వాత నుంచి కరెంట్ కోతలు ఎక్కువయ్యేలా ఉన్నాయి. ఇదంతా జగన్ ప్రభుత్వం తప్పిదమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ప్రభుత్వ పరిపాలనా రాహిత్యం, అవగాహనాలోపం వల్లే రాష్ట్రంలో విద్యుత్ రంగం చతికిలపడిందని రఘురామకృష్ణంరాజు లాంటి వారు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం…ప్రజల పవన్ కట్ చేస్తే….ప్రజలు…వైసీపీ పవర్ కట్ చేస్తారని అంటున్నారు. వాస్తవానికి చూసుకుంటే అదే నిజమయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పటివరకు ఎన్ని పన్నులు పెంచిన ప్రజలు భరిస్తున్నారు….కానీ పవర్ కట్ విషయంలో మాత్రం సహించడం కష్టమే అని చెప్పొచ్చు.

Discussion about this post