తాను జనం కోసం ఏదైనా చేస్తానని, ఎంత దూరమైన వెళ్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్ని సార్లు చెప్పి ఉంటారో అందరికీ తెలిసిందే. కానీ ఆయన ఎన్ని సార్లు జనం కోసం నిలబడ్డారు అంటే? ఏమో చెప్పడం కష్టమే అనాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెబుతారు గాని, చేయరు అని చెప్పొచ్చు. ఏదో కొన్నిసార్లు మాత్రమే ప్రజా సమస్యలపై పోరాడినట్లు కనిపిస్తారు గాని,…మళ్ళీ దానిపై పోరాడుతున్నట్లు కనిపించరు. ఆయన ఏపీకి రావడం ఒక ఇష్యూపై మాట్లాడటం..మళ్ళీ కనబడకుండా వెళ్లిపోవడం చేస్తారు.

ఏదో గతంలో ఒకసారి రోడ్లపై గుంతలు విషయంలో ఆందోళనలు చేశారు…కానీ ఆందోళన పూర్తి స్థాయిలో సక్సెస్ చేయలేకపోయారు. ఇప్పుడు మత్స్యకారుల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో 217 తెచ్చిందని, దీన్ని రద్దు చేసేవరకు పోరాడతానని పవన్ చెబుతున్నారు. తాజాగా నరసాపురంలో ఆయన మత్యకారులతో భారీ సభని ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో అండగా ఉండి జనసేనకు మద్దతు తెలిపితే.. మత్స్యకారులను ఆర్థికంగా, విద్యాపరంగా పైకి తీసుకొచ్చేలా మేనిఫెస్టోను తయారుచేస్తామని, తాము అధికారంలో వస్తే వారం రోజుల్లో 217 జీవోను రద్దు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.

అయితే ఇంకో ప్రభుత్వం రావడానికి ఇంకా రెండున్నర ఏళ్ల వరకు సమయం ఉంది..ఈ లోపు జీవో 217 కంటిన్యూ అవుతుంది..మరి దానిపై మళ్ళీ పోరాటం చేస్తారా లేక చేతులెత్తేస్తారా అనేది క్లారిటీ లేదు. కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది…పవన్ ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడితే…అది బాగా హైలైట్ అవుతుంది..ప్రజల్లోకి బలంగా వెళుతుంది.

అలాగే ఆ సమస్య పరిష్కారం అయ్యేవరకు పవన్ నిలబడితే ప్రజల సపోర్ట్ కూడా వస్తుంది. కానీ పవన్ అలా చేయరు..ఎంతసేపు మాటల పోరు తప్ప…చేతల పోరు ఉండదు. ఏదో అప్పుడప్పుడు తప్ప..పూర్తి స్థాయిలో పవన్ పోరాటం చేయడం లేదు. అలా చేయడం వల్ల జనసేన పార్టీ సైతం బలపడలేకపోతుంది..మరి పవన్ ఎప్పుడు పూర్తిగా చేతల్లోకి వస్తారో చూడాలి.

Discussion about this post