ఎందుకిలా జరిగింది? నాయకులకు.. ప్రజాప్రతినిధులకు మధ్య గ్యాప్ ఎందుకు ఇంతగా పెరిగింది? ఇదీ.. ఇప్పుడు అధికార పార్టీ వైసీపీకి కలవర పెడుతున్న ప్రధాన విషయం ఎందుకంటే.. ఇప్పుడు చేపట్టిన గడ ప గడప కార్యక్రమంలో నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. మరికొందరు నాయకులు వస్తున్నారని తెలిసి.. తలుపులు వేసేస్తున్నారు. ఇంకొందరు.. ఎన్నికలు అయ్యాక.. మూడేళ్లకు మేం గుర్తుకు వచ్చామా? అని ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం.. ఇప్పటి వరకు ప్రజలను నాయకులు పట్టించుకోకపోవడమే.

ఇలా ఎందుకు జరిగింది అంటే.. అన్ని వేళ్లు కూడా సీఎం జగన్‌వైపే చూపిస్తున్నాయి. ఆయన చేపట్టిన పనుల కారణంగానే నాయకులకు ప్రజలకు మధ్య గ్యాప్ పెరిగింది. వలంటీర్ వ్యవస్థనుతీసుకురావడం.. ప్రజలకు ఉన్న సమస్యలను.. వారి ద్వారానే తెలుసుకోవడం.. సంక్షేమ ఫలాలను వారి ద్వారానే అంది స్తుండడం వంటివి అన్నీ కూడా నాయకులకు.. ప్రజలకు మధ్య గ్యాప్ పెరిగేలా చేశాయి. ఈ పరిణామాలే ఇప్పుడు గడప గడపకు కార్యక్రమంలో స్పష్టం గా కనిపిస్తున్నాయి.

ఎంతగా సర్దు బాటు చేయాలని అన్నా కూడా.. ఎక్కడా కూడా.. ప్రజలు సర్దుకు పోయేందుకు సిద్ధంగా లేరు. అంతేకాదు.. నాయకులతో చర్చించేందుకు కూడా ప్రజలు రెడీ కాకపోవడం.. గడప గడపకు కార్యక్రమంలో నాయకులకు.. తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యేందుకు కారణంగా మారింది. దీనిని తగ్గించడం ఎలా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికిప్పుడు.. ప్రజలకు.. నాయకులకు మధ్య సంబంధం పెంచేలా.. పార్టీ అధిష్టానమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మరి దీనికి ఏం చేయాలి.? ఏం చేస్తారు? అనేది చూడాలి. ఏదేమైనా.. వలంటీర్ వ్యవస్థ ఓకే అయినప్పటికీ.. ఇలా పార్టీకి చేటు తెచ్చే ప్రయోగంగా మారిపోవడం.. వైసీపీ నేతలకు ఇబ్బందిగా మారిందనేది వాస్తవం.

Discussion about this post